ట్రాఫిక్‌ నియంత్రణకు పటిష్ట ప్రణాళిక : ఎస్పీ | - | Sakshi
Sakshi News home page

ట్రాఫిక్‌ నియంత్రణకు పటిష్ట ప్రణాళిక : ఎస్పీ

Jul 2 2026 6:49 AM | Updated on Jul 2 2026 6:49 AM

నల్లగొండ (సూర్యాపేటటౌన్‌) : జిల్లా కేంద్రంలో ట్రాఫిక్‌ నియంత్రణకు పటిష్ట ప్రణాళిక రూపొందించినట్లు ఎస్పీ నరసింహ తెలిపారు. జిల్లా కేంద్రంలోని కొత్త బస్టాండ్‌ చౌరస్తా, ఖమ్మం ఎక్స్‌ రోడ్‌ చౌరస్తా వద్ద ట్రాఫిక్‌ సిగ్నల్స్‌, పోలీస్‌ సిబ్బంది పనితీరును బుధవారం ఆయన పరిశీలించారు. అనంతరం మాట్లాడుతూ జిల్లా కేంద్రంలో వాహనాల రద్దీని దృష్టిలో ఉంచుకొని ప్రజలకు ఇబ్బందులు కలుగకుండా ఉండేలా ఆధునిక పద్ధతుల్లో ట్రాఫిక్‌ సిగ్నల్స్‌ను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ప్రజలు, వాహనదారులు ట్రాఫిక్‌ రూల్స్‌ పాటించాలన్నారు. రోడ్లను, ఫుట్‌పాత్‌లను ఆక్రమించి వ్యాపారాలు నిర్వహిస్తున్న వారిని సర్దుబాటు చేయడానికి ‘ఆపరేషన్‌ రోప్‌’ కార్యక్రమాన్ని ప్రారంభించినట్లు తెలిపారు. వ్యాపారులు రోడ్లను ఆక్రమించి వ్యాపారం నిర్వహించవద్దని సూచించారు. ఆయన వెంట డీఎస్పీ ప్రసన్నకుమార్‌, పట్టణ ఇన్‌స్పెక్టర్‌ వెంకటయ్య, ఆర్టీసీ మేనేజర్‌, ట్రాఫిక్‌ ఎస్‌ఐ ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement