‘సర్‌’లో తప్పులు దొర్లకుండా చూడాలి | - | Sakshi
Sakshi News home page

‘సర్‌’లో తప్పులు దొర్లకుండా చూడాలి

Jul 3 2026 10:56 AM | Updated on Jul 3 2026 10:56 AM

అర్వపల్లి : ఎన్యుమరేషన్‌న్‌పత్రాలు ఆన్‌లైన్‌లో అప్‌లోడ్‌ చేసే సమయంలో బీఎల్‌ఓలు తప్పులు దొర్లకుండా చూడాలని అదనపు కలెక్టర్‌ హరిసింగ్‌ సూచించారు. గురువారం అర్వపల్లి ఎంపీడీఓ కార్యాలయంలో సర్‌ కార్యక్రమంపై బీఎల్‌ఓలకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఓటర్లు ఎన్యుమరేషన్‌ పత్రాలను నింపి ఇస్తున్నందున వాటిని యాప్‌లో అప్‌లోడ్‌ చేసే విషయంలో జాగ్రత్త వహించాలన్నారు. అనంతరం బీఎల్‌ఓలకు పవర్‌బ్యాంక్‌లు, టీషర్టులు పంపిణీ చేశారు. కార్యక్రమంలో తహసీల్దార్‌ బాషపాక శ్రీకాంత్‌, నాయబ్‌ తహసీల్దార్‌ సమ్మెట అశ్వని, గిర్ధావర్‌ పాటి వెంకట్‌రెడ్డి, శిక్షకులు సైదులు, ధనలక్ష్మి పాల్గొన్నారు.

సమగ్ర సమాచారం తీసుకోవాలి

తిరుమలగిరి (తుంగతుర్తి) : ఓటరు జాబితాపై బీఎల్‌ఓలు సమగ్ర సమాచారం తీసుకోవాలని అదనపు కలెక్టర్‌ బి.హరిసింగ్‌ సూచించారు. గురువారం తిరుమలగిరి మండలం తొండ గ్రామంలోని రైతు వేదికలో ఎన్యుమరేషన్‌ ఫారాలపై బీఎల్‌ఓలకు శిక్షణ తరగతులు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆయన హాజరై మాట్లాడుతూ.. బూత్‌ లెవల్‌ అధికారులు ఇంటింటికీ ఎన్యుమరేషన్‌ ఫారాలు అందించిన తరువాత వాటిని సమగ్ర సమాచారంతో నింపేవిధంగా ప్రజలకు సహకరించాలన్నారు. కార్యక్రమంలో తిరుమలగిరి మండల ఇన్‌చార్జ్‌ తహసీల్దార్‌ ఎస్‌.పుష్ప, డిప్యూటీ తహసీల్దార్‌ జాన్‌ మహ్మద్‌, సిబ్బంది పాల్గొన్నారు.

ఫ అదనపు కలెక్టర్‌ హరిసింగ్‌

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement