రైతులను మోసం చేస్తున్న ప్రభుత్వం | - | Sakshi
Sakshi News home page

రైతులను మోసం చేస్తున్న ప్రభుత్వం

Jun 21 2026 8:04 AM | Updated on Jun 21 2026 8:04 AM

సూర్యాపేటటౌన్‌ : రాష్ట్రంలో జరుగనున్న ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ ప్రక్రియలో పెద్ద ఎత్తున ఓట్లు గల్లంతయ్యే ప్రమాదం ఉందని, బీఆర్‌ఎస్‌ నాయకులు, కార్యకర్తలు అప్రమత్తంగా ఉండాలని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీష్‌రెడ్డి అన్నారు. జిల్లా కేంద్రంలోని మన్నెం సదాశివారెడ్డి ఫంక్షన్‌హాల్లో శనివారం సర్‌ పై నియోజకవర్గ నాయకులు, కార్యకర్తకు నిర్వహించిన అవగాహన సదస్సులో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో ప్రస్తుతం అత్యంత దుర్మార్గమైన ప్రభుత్వం పాలన సాగిస్తోందన్నారు. కేబినెట్‌ సమావేశం నిర్వహించి మరీ ధాన్యం కొనబోమని ప్రకటించింది ఒక్క కాంగ్రెస్‌ ప్రభుత్వంమే అన్నారు. గత ప్రభుత్వ హయాంలో ధాన్యం కొనుగోలుకు కేంద్ర ప్రభుత్వం నిరాకరించినప్పుడు కేసీఆర్‌ ఢిల్లీలో ధర్నా చేశారని, చివరకు రాష్ట్ర ప్రభుత్వమే ధాన్యం కొనుగోలు చేసిందని గుర్తుచేశారు. ప్రస్తుత కాంగ్రెస్‌ ప్రభుత్వం సన్నధాన్యానికి బోనస్‌ ఇస్తామని చెప్పి రైతులను మోసం చేసిందన్నారు. కేసీఆర్‌ను మళ్లీ ముఖ్యమంత్రిని చేసే వరకు పార్టీ కార్యకర్తలు విశ్రమించవద్దని పిలుపునిచ్చారు. సమావేశంలో బీఆర్‌ఎస్‌ రాష్ట్ర కార్యదర్శి ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌, జిల్లా అధ్యక్షుడు బడుగుల లింగయ్య యాదవ్‌, నాయకులు రాంచందర్‌నాయక్‌, వై.వెంకటేశ్వర్లు, నిమ్మల శ్రీనివాస్‌గౌడ్‌, మారిపెద్ది శ్రీనివాస్‌గౌడ్‌, నాయ కులు కార్యకర్తలు పాల్గొన్నారు.

ఫ మాజీ మంత్రి జగదీష్‌రెడ్డి

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement