శ్రీచందులాల్‌ స్వామికి జలాభిషేకం | - | Sakshi
Sakshi News home page

శ్రీచందులాల్‌ స్వామికి జలాభిషేకం

Jul 3 2026 10:56 AM | Updated on Jul 3 2026 10:56 AM

చివ్వెంల : వర్షాలు సమృద్ధిగా కురిసి, పాడి పంటలు బాగా పండాలని కోరుతూ గురువారం చివ్వెంల మండల పరిధిలోని పాండ్యానాయక్‌ తండాలో గిరిజనులు తమ ఆరాధ్యదైవం శ్రీచందులాల్‌ స్వామికి జలాభిషేకం చేశారు నీళ్ల బిందెలతో ఊరేగింపుగా గ్రామ శివారులోని ఆలయం వద్దకు వెళ్లి ప్రదక్షిణలు నిర్వహించారు. స్వామివారికి జలాభిషేకం చేశారు. కార్యక్రమంలో సర్పంచ్‌ ధరావతు భద్రమ్మ హనుమానాయక్‌, పంచాయతీ కార్యదర్శి మంగ, ఉప సర్పంచ్‌ లాలునాయక్‌, మంగ్యనాయక్‌, చందునాయక్‌, వార్డు సభ్యులు, మహిళలు, యువకులు తదితరులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement