అర్వపల్లి : జాజిరెడ్డిగూడెం మండలం తిమ్మాపురంలో సోమవారం పాల ఉత్పత్తిదారుల సహకార సంఘం ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్, బీఆర్‌ఎస్ పార్టీల నాయకుల మధ్య ఘర్షణతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఈ క్రమంలో కొందరు బ్యాలెట్ బాక్స్‌లు ఎత్తుకెళ్లడానికి ప్రయత్నించారు. దీంతో సూర్యాపేట డీఎస్పీ ప్రసన్నకుమార్, నాగారం సీఐ నాగేశ్వరరావు, అర్వపల్లి ఎస్‌ఐ పి.మధు ఆధ్వర్యంలో పోలీస్ బందోబస్తు నిర్వహించారు. ఎన్నికలు అయ్యాక కౌంటింగ్‌కు ఏజెంట్లు రాకపోవడంతో మంగళవారానికి కౌంటింగ్‌ను వాయిదా వేస్తున్నట్లు ఎన్నికల అధికారి మల్లయ్య ప్రకటించారు. కాగా ఈ ఎన్నికల్లో 55 మంది సభ్యులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా మాజీ వైస్ ఎంపీపీ మారిపెద్ది భవాణి శ్రీనివా్‌స్‌గౌడ్, బీఆర్‌ఎస్ మండల అధ్యక్షుడు గుండగాని సోమేష్‌గౌడ్, సర్పంచ్ బొడ్డు ఇందిరసోమరాజ్ మాట్లాడుతూ ఓడిపోతామనే భయంతో అధికార పార్టీ నాయకులు బ్యాలెట్ బాక్స్‌లను తీసుకెళ్లడానికి ప్రయత్నించారని ఆరోపించారు. ఈ విషయంలో కలెక్టర్ జోక్యం చేసుకొని ఘర్షణకు కారణమైన వారి చర్యలు తీసుకోవాలని వారు కోరారు.
తిమ్మాపురంలో కాంగ్రెస్, బీఆర్‌ఎస్ నాయకుల మధ్య ఘర్షణ
ఏజెంట్లు రాకపోవడంతో
వాయిదా పడిన ఓట్ల లెక్కింపు


