చిలుకూరు : రైతులకు యూరియా సరఫరాలో ఇబ్బందులు లేకుండా చూస్తామని జిల్లా సహకార అధికారి శ్రీరాం అన్నారు. గురువారం చిలుకూరు ప్రాథమిక సహకార సంఘం కార్యాలయాన్ని ఆయన తనిఖీ చేసి రికార్డులు పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. చిలుకూరు సహకార సంఘం ఎఫ్‌పీఓకు ఎంపికై నందున ఈక్విటీ గ్రాంట్ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి రూ.ఆరు లక్షలు సొసైటీ అకౌంట్‌లో జమయ్యాయని తెలిపారు. సంఘంలో 300 మంది సభ్యత్వం తీసుకున్నారని, ఇంకా 450 మంది రైతులకు అవకాశం ఉందని తెలిపారు. చిలుకూరు సహకార సంఘానికి కామన్ సర్వీస్ సెంటర్‌ను వెంటనే ఓపెన్ చేయాలని సూచించారు. అనంతరం డీసీఓను చైర్మన్, సిబ్బంది ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో ఎఫ్‌ఈఓ అధికారి రాజు, సంఘం చైర్మన్ అ లసకాని జనార్దన్, వైస్ చైర్మన్ పద్మావతి, సంఘం సీఈఓ లక్ష్మీనారాయణ, డైరెక్టర్లు, పాల్గొన్నారు.
ఫ జిల్లా సహకార అధికారి శ్రీరాం


