అనంతగిరి: యువత ఉన్నత లక్ష్యాలను ఎంచుకొని వాటి సాధన దిశగా అడుగులు వేయాలని ఎస్పీ నరసింహ సూచించారు. డ్రగ్స్ నిర్మూలన, సైబర్ మోసాల నివారణ, రోడ్డు ప్రమాదాల నియంత్రణపై మంగళవారం స్థానిక అనురాగ్ ఇంజనీరింగ్ కళాశాలలో నిర్వహించిన అవగాహన సదస్సులో ఎస్పీ మాట్లాడారు. యువత డ్రగ్స్‌కు దూరంగా ఉండాలన్నారు. మహిళల భద్రతకు అత్యున్నత ప్రాధాన్యం ఇస్తున్నట్లు చెప్పారు. అనంతరం అనంతగిరి పోలీస్ స్టేషన్‌న్‌ను సందర్శించారు. రికార్డులను పరిశీలించి సిబ్బందికి సూచనలిచ్చారు. మత్తు పదార్థాల అక్రమ రవాణా, అసాంఘిక కార్యకలాపాల నివారణపై దృష్టి సారించాలని సిబ్బందికి సూచించారు. కేసుల దర్యాప్తును వేగవంతం చేయాలన్నారు. ఆయన వెంట డీఎస్పీ శ్రీనివాస్‌రెడ్డి, మునగాల సీఐ రామకష్ణారెడ్డి, ఎస్‌ఐ నవీన్‌న్‌కుమార్, సిబ్బంది ఉన్నారు.
ఫ ఎస్పీ నరసింహ


