ప్రశాంతంగా మూసీ మత్స్య సంఘం ఎన్నికలు | - | Sakshi
Sakshi News home page

ప్రశాంతంగా మూసీ మత్స్య సంఘం ఎన్నికలు

Jun 26 2026 7:21 AM | Updated on Jun 26 2026 7:21 AM

నకిరేకల్‌ : నల్లగొండ, సూర్యాపేట జిల్లా పరిధిలోని మూసీ ప్రాజెక్టు మత్స్య పారిశ్రామిక సహకార సంఘం ఎన్నికలు గురువారం ప్రశాంతంగా జరిగాయి. మూసీ మత్స్య సంఘానికి తొమ్మిదేళ్ల తర్వాత నిర్వహిస్తున్న ఈ ఎన్నికలు పంచాయతీ పోరును తలంపించాయి. నకిరేకల్‌ మండలం ఓగోడు గ్రామంలోని ఏవీకే ఫంక్షన్‌ హాల్‌లో బ్యాలెట్‌ పద్ధతిన పోలింగ్‌ నిర్వహించారు. ఓటు వేసేందుకు ఓటర్లు పెదసంఖ్యలో బారులుదీరారు. ఉదయం 7 గంటల నుంచి ప్రారంభమైన పోలింగ్‌ ప్రక్రియలో మధ్యాహ్నం 2.30 గంటల వరకు ఓటర్లను హాల్‌లోకి అనుమతి ఇచ్చారు. మొత్తం 13 డైరెక్టర్ల పదవులకు గాను 44 మంది పోటీ పడుతున్నారు. ప్రతి ఓటరు 13 మందికి ఓటు వేయాల్సి ఉండడంతో పోలింగ్‌ ప్రక్రియ గంట అలస్యంగా ముగిసింది. మొత్తం 3,557 మంది ఓటర్లకుగాను, 3,118 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. 87.35 శాతం పోలింగ్‌ నమోదైందని అధికారులు వెల్లడించారు. కౌంటింగ్‌ ప్రక్రియ అర్ధరాత్రి వరకు కొనసాగింది.

బరిలో 44 మంది అభ్యర్థులు

మూసీ మత్స్య సంఘం ఎన్నికల నిర్వహణతో ఓగోడు గ్రామంలో సందడి నెలకొంది. పోటీలో ఉన్న 44 మంది అభ్యర్థులు తమకు ఓటు వేయాలని పోలింగ్‌ కేంద్రం ఎదుట ప్రచారం నిర్వహించారు. దీంతో మాధారం – ఓగోడు రహదారి మొత్తం జనంతో కిక్కిరిసిపోయింది. ఎన్నికలు నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరిగకుండా పోలీసులు బందోబస్తు నిర్వహించారు. ఎన్నికల సెంటర్‌ను డీసీఆర్‌బీ డీఎస్పీ రవి సందర్శించి పర్యవేక్షించారు. నకిరేకల్‌, శాలిగౌరారం సీఐలు హరిబాబు, రాజశేఖర్‌ ఆధ్వర్యంలో పోలీసులు బందోబస్తు నిర్వహించారు.

87.65 శాతం పోలింగ్‌ నమోదు

ఫ అర్ధరాత్రి వరకు కొనసాగిన

ఓట్ల లెక్కింపు

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement