మాది వ్యవసాయ కుటుంబం. అమ్మానాన్నలు వ్యవసాయదారులు కావడంతో అందులో ఉన్న కష్టాలు తెలుసుకొన్నాను. వ్యవసాయ రంగంలో నూతన విధానాలు అమలు చేయాలనే ఉద్దేశంతో రాజేంద్రనగర్‌లో అగ్రికల్చర్ ఇంజనీరింగ్ డిప్లోమా చదివాను. 2017లో వ్యవసాయ విస్తరణ అధికారి ఉద్యోగాల నోటిఫికేషన్ రాగా పరీక్ష రాశాను. నాకు ఉద్యోగం వచ్చింది. ఆ తర్వాత బీటెక్ అగ్రికల్చర్ సంగారెడ్డిలో పూర్తి చేశాను. 2025 ఆగస్టులో జిల్లా ఉత్తమ వ్యవసాయ విస్తరణ అధికారిగా అవార్డు లభించింది. నేను ఖాళీగా ఉన్న సమయంలో అమ్మా నాన్నలకు తోడుగా వ్యవసాయ పనులు చేస్తుంటాను. శాసీ్త్రయ వ్యవసాయ విధానం గురించి రైతులకు తెలియజేస్తున్నాను.
–సాయి శ్రీజన, ఏఈఓ తుంగతుర్తి


