అర్వపల్లి : మహిళా సమాఖ్య భవనాల నిర్మాణ పనులను సర్పంచుల సమన్వయంతో త్వరితగతిన పూర్తిచేయించాలని జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ అధికారి (డీఆర్‌డీఓ) సన్యాసయ్య సూచించారు. అర్వపల్లిలోని మండల మహిళా సమాఖ్య కార్యాలయంలో గురువారం తుంగతుర్తి నియోజకవర్గంలోని తుంగతుర్తి, తిరుమలగిరి, నాగారం, జాజిరెడ్డిగూడెం మండలాల ఏపీఎంలు, సీసీలతో సెర్ప్ కార్యక్రమాలపై సమీక్ష సమావేశం నిర్వహించారు. సీ్త్రనిధి, బ్యాంక్ రుణాలను టార్గెట్ ప్రకారం మంజూరు చేయించాలని ఆదేశించారు. సమావేశంలో అదనపు డీఆర్‌డీఓ సురేష్, డీపీఎంలు లక్ష్మీనా రాయణ, అరుణ్, ఏపీఎంలు రాంబాబు, వినోద్, మల్లేష్, యాదమ్మ, లక్ష్మి, వెంకట్‌రెడ్డి పాల్గొన్నారు.
ఫ డీఆర్‌డీఓ సన్యాసయ్య


