సంక్షేమ శాఖ అధికారులు సమన్వయంతో పనిచేయాలి | - | Sakshi
Sakshi News home page

సంక్షేమ శాఖ అధికారులు సమన్వయంతో పనిచేయాలి

Jun 25 2026 5:53 AM | Updated on Jun 25 2026 5:53 AM

సూర్యాపేటటౌన్‌ : మహిళలు, బాలల భద్రత, రక్షణకు ప్రభుత్వ సంక్షేమ శాఖల అధికారులు పరస్పర సమన్వయంతో పనిచేయాలని ఎస్పీ నరసింహ అన్నారు. బుధవారం జిల్లా పోలీస్‌ భరోసా టీమ్‌ ఆధ్వర్యంలో జిల్లా పోలీస్‌ కార్యాలయ వీడియో కాన్ఫరెన్స్‌ హాల్‌ నుంచి జిల్లాలోని పోలీస్‌ అధికారులు, శిశు సంక్షేమ శాఖ, మహిళా సంక్షేమ శాఖ, జిల్లా చైల్డ్‌ లైన్‌, చైల్డ్‌ వెల్ఫేర్‌ కమిటీ అధికారులతో ఎస్పీ ఉన్నత స్థాయి వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మహిళా, బాల బాధితుల పట్ల అధికారులు మానవతాదృక్పథంతో వ్యవహరించాలన్నారు. మహిళలు, బాలలపై దాడులు, వేధింపులు, లైంగిక దాడుల వంటి ఫిర్యాదులు వస్తే తక్షణమే స్పందించి బాధితులకు అండగా నిలవాలన్నారు. మహిళలు, బాలల పట్ల వేధింపులు జరిగితే డయల్‌ 100, 112, హెల్ప్‌ లైన్‌ నంబర్‌ 1098కు సమాచారం ఇవ్వాలని తెలిపారు. కార్యక్రమంలో అదనపు ఎస్పీ రవీందర్‌ రెడ్డి, జిల్లా సంక్షేమ అధికారి నరసింహారావు, జిల్లా వైద్యాధికారి వెంకటరమణ, చైల్డ్‌ వెల్ఫేర్‌ కమిటీ చైర్మన్‌ రమణారావు, జిల్లా జువైనల్‌ ప్రొహిబిషన్‌ అధికారి, డీసీపీఓ రవి కుమార్‌ పాల్గొన్నారు.

ఎస్పీ నరసింహ

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement