చేనేత ఎన్నికలకు నోటిఫికేషన్‌ | - | Sakshi
Sakshi News home page

చేనేత ఎన్నికలకు నోటిఫికేషన్‌

Jun 30 2026 7:07 AM | Updated on Jun 30 2026 7:07 AM

ఎన్నికల నిర్వహణకు సహకరించాలి

చేసేత సహకార సంఘాలలో ఫొటోతో కూడిన ఓటరు జాబితా సిద్ధంగా ఉంది. ఎన్నికలు సజావుగా నిర్వహించేందుకు సంఘాల సభ్యులంతా సహకరించాలి.

– శ్రీనివాసరావు,

యాదాద్రి జిల్లా చేనేత, జౌళిశాఖ ఏడీ

భూదాన్‌పోచంపల్లి: ఉమ్మడి నల్లగొండ జిల్లాలో చేనేత సహకార సంఘాలకు ఎన్నికల నగారా మోగింది. సోమవారం రాష్ట్ర సహకార ఎన్నికల అథారిటీ ఆధ్వర్యంలో ఎన్నికల నోటిఫికేషన్‌ జారీ చేశారు. మొత్తం 72 సంఘాలకు ఎన్నికలు జరగనున్నాయి. వీటిలో 15,022 మంది ఓటర్లు ఉన్నారు. కాగా యాదాద్రి జిల్లాలో 37 చేనేత సంఘాలు, 4 పవర్‌లూమ్‌ సంఘాలున్నాయి. వీటి పరిధిలో 5,495 మంది పురుషులు, 3,156 మహిళా ఓటర్లు ఉన్నారు. అత్యధికంగా యాదాద్రి జిల్లాలో పోచంపల్లి చేనేత సహకార సంఘంలో 644 మంది, చౌటుప్పల్‌ 549 మంది, కొయ్యలగూడెం 518 మంది ఓటర్లు ఉన్నారు. ఎన్నికలను విజయవంతంగా నిర్వహించేందుకు రాష్ట్ర సహకార ఎన్నికల ఆఽథారిటీతో పాటు యాదాద్రి భువనగిరి, మేడ్చల్‌ మల్కాజ్‌గిరి, రంగారెడ్డి జిల్లాల్లోని సహకార సంఘాల్లో వివిధ హోదాలో పనిచేస్తున్న అధికారులను నియమించారు.

రహస్య బ్యాలెట్‌ పద్ధతిలో..

జూలై 2 నుంచి 4 వరకు నామినేషన్లు స్వీకరిస్తారు.

5న నామినేషన్ల పరిశీలన ఉంటుంది. 6న నామినేషన్ల ఉపసంహరణ, అదే రోజు బరిలో ఉన్న అభ్యర్థులకు గుర్తులు కేటాయిస్తారు. 10న ఉదయం 8 గంటల నుంచి 2 గంటలకు వరకు రహస్య బ్యాలెట్‌ పద్ధతిలో పోలింగ్‌ నిర్వహిస్తారు. ఇదే రోజు 3 గంటల నుంచి ఓట్లను లెక్కించి ఫలితాలు ప్రకటిస్తారు.

నామినేషన్‌ ఫీజు ఇలా...

నామినేషన్‌ ఫీజు ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకై తే రూ.500, బీసీ అభ్యర్థులకు రూ.750, ఇతరులకు రూ.1000గా అధికారులు నిర్ణయించారు. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు తమ కులధ్రువీకరణ పత్రాన్ని జతపర్చాల్సి ఉంటుంది. అలాగే నామినేషన్‌ పత్రంతో పాటు రెండు పాస్‌పోర్ట్‌ సైజ్‌ ఫొటోలు జతపర్చాలి. ఒక్క ఓటరు పోటీ చేసే ఒక వ్యక్తిని మాత్రమే బలపర్చాల్సి ఉంటుంది.

ప్రతి సంఘంలో 9 మంది డైరెక్టర్లు..

కాగా ఎన్నికలు రహస్య బ్యాలెట్‌ పద్ధతిలో నిర్వహిస్తారు. ప్రతి సంఘంలో 9 మంది డైరెక్టర్లను ఎన్నుకుంటారు. ఇందులో జనరల్‌ స్థానాలు 7, మహిళకు 3 స్థానాలు రిజర్వు చేశారు.

ఫ ఉమ్మడి నల్లగొండ జిల్లాలో

72 సంఘాలకు ఎన్నికలు

ఫ 2నుంచి నామినేషన్ల స్వీకరణ

ఫ 10వ తేదీన పోలింగ్‌

చేనేత సహకార సంఘాలు, ఓటర్ల వివరాలు

జిల్లా సంఘాలు ఓటర్ల సంఖ్య

యాదాద్రి 41 8,651

నల్లగొండ 28 5,723

సూర్యాపేట 03 648

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement