పెండింగ్‌ దరఖాస్తులు పరిష్కరించాలి | - | Sakshi
Sakshi News home page

పెండింగ్‌ దరఖాస్తులు పరిష్కరించాలి

Jun 24 2026 1:29 AM | Updated on Jun 24 2026 1:29 AM

భానుపురి (సూర్యాపేట) : జిల్లాలో పెండింగ్‌లో ఉన్న సాదా బైనామా, భూ భారతి, రెవెన్యూ సదస్సుల దరఖాస్తులను వెంటనే పరిష్కరించాలని భూ పరిపాలనశాఖ కమిషనర్‌ డీఎస్‌.లోకేష్‌కుమార్‌ అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో కలెక్టర్‌ అధ్యక్షతన రెవెన్యూ అధికారులు, సర్వేయర్లు, జీపీఓలతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో స్టాంప్స్‌ అండ్‌ సెంటర్‌ రిజిస్ట్రేషన్‌ ప్రిన్సిపల్‌ సెక్రెటరీ రాజీవ్‌గాంధీ హన్మంత్‌తో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మద్దిరాల, నూతకల్లు మండలాలలో భూ పరిమితి చట్టం 1973 కంటే ముందుగానే భూములను కొనుగోలు చేసి అప్పటి నుంచి నిరంతరంగా సాగు చేస్తున్న వ్యవసాయ భూములకు త్వరలోనే పట్టాలను పంపిణీ చేస్తామన్నారు. అర్హులైన లబ్ధిదారులందరికీ రికార్డు హక్కులను కల్పించి పట్టాలు ఇచ్చేందుకు వీలుగా ప్రొసీడింగ్స్‌ సిద్ధం చేయాలని ఆదేశించారు. లైసెన్స్‌ సర్వేయర్ల ద్వారా సర్వే చేయించాలని సర్వే పూర్తి అయిన తర్వాత నివేదికలను ప్రభుత్వానికి సమర్పిస్తే వారికి పట్టాదారు పాస్‌ పుస్తకాలు అందించేందుకు చర్యలు తీసుకుంటుందన్నారు. ఆర్డీఓలు, తహసీల్దార్లు జీపీఓల సహకారంతో పకడ్బందీగా సర్వే చేయాలని, అభ్యంతరాలు ఉన్న వాటిని పెండింగ్‌లో పెట్టాలని సూచించారు. సమావేశంలో కలెక్టర్‌ తేజస్‌ నంద్‌లాల్‌ పవార్‌, అదనపు కలెక్టర్‌ హరి సింగ్‌, డీఆర్వో ప్రేమ్‌రాజు, ఆర్డీఓలు వేణుమాధవ్‌, సూర్యనారాయణ, శ్రీనివాసులు, తహసీల్దార్లు, సెక్షన్‌ సూపరింటెండెట్లు, తదితరులు పాల్గొన్నారు.

ఫ భూ పరిపాలనశాఖ కమిషనర్‌

డీఎస్‌.లోకేష్‌కుమార్‌

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement