అక్రమాలపై మాట్లాడితే కేసులు పెడుతున్నారు | - | Sakshi
Sakshi News home page

అక్రమాలపై మాట్లాడితే కేసులు పెడుతున్నారు

Jul 10 2026 3:45 PM | Updated on Jul 10 2026 3:45 PM

చిలుకూరు: కోదాడ మట్టి, ఇసుక మాఫియాకు అడ్డాగా మారిందని, ఇలాంటి అక్రమాలపై మాట్లాడితే కేసులు పెడుతున్నారని కోదాడ మాజీ ఎమ్మెల్యే, బీఆర్‌ఎస్‌ పార్టీ కోదాడ అసెంబ్లీ నియోజవర్గ ఇన్‌చార్జి బొల్లం మల్లయ్య యాదవ్‌ అన్నారు. గురువారం చిలుకూరులోని బీఆర్‌ఎస్‌ పార్టీ సీనియర్‌ నాయకుడు బెల్లంకొండ సైదులు నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కోదాడ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తామని చెబుతున్న ఉత్తమ్‌ దంపతులు అక్రమాలను ప్రోత్సహిస్తున్నారని విమర్శించారు. పోలీస్‌, రెవెన్యూ, ఇరిగేషన్‌, మైనింగ్‌ అధికారుల అండదండలతో కొంత మంది బినామీల ద్వారా వారు కోట్ల రూపాయలు దోచుకుంటున్నారని మండిపడ్డారు. కోదాడను కాపాడుకునే సమయం వచ్చిందన్నారు. అక్రమలపై తాను బహిరంగ చర్చకు సిద్ధమని పేర్కొన్నారు. సమావేశంలో పార్టీ మండల అధ్యక్షుడు అక్కినపల్లి జానకిరామాచారి, ఉప సర్పంచ్‌ బెల్లంకొండ నాగయ్య, చిలుకూరు ఫ్యాక్స్‌ చైర్మన్‌ అలసకాని జనార్దన్‌, మాజీ జెడ్పీటీసీ భట్టు శివాజీ నాయక్‌, మాజీ జెడ్పీ కోఆప్షన్‌ సభ్యులు జానిమియా, మైనార్టీ నాయకులు షేక్‌ పాషా, బెల్లంకొండ సైదులు, తాళ్ళూరి శ్రీను, మేకపోతుల శ్రీను, మాదవరపు శ్రీను, రాధాకృష్ణ, నిగిడాల వీరయ్య, అల్లి ఉపేందర్‌, అమరగాని లింగరాజు, షాకీర్‌, రాజు, నర్సయ్య, వెంకయ్య తదితరులు పాల్గొన్నారు.

మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement