హుజూర్‌నగర్ (మేళ్లచెరువు) : మండలంలోని పలు గ్రామాల్లో రైతులు సోమవారం ఏరువాక పౌర్ణమిని వైభవంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా మేళ్లచెరువులో రైతులు తమ ఎద్దులను పుసుపు కుంకుమలతో అందంగా అలంకరించి అరకలు కట్టి ‘ఏరువాకా సాగారో అన్నో చిన్నన్న.. నీ కష్టమంతాతీరునురో అన్నో రైతన్న’ అంటూ పాటలు పాడుకుంటూ డప్పు చప్పుళ్ల నడుమ వీధుల్లో ఊరేగింపు నిర్వహించారు. అనంతరం వినాయకుడి దేవా లయం వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించారు. మంచిరోజు కావడంతో వ్యవసాయ పనులు మొదలుపెట్టారు. కార్యక్రమంలో రైతులు పాల్గొన్నారు.


