మిర్యాలగూడ : ఇతర దేశాలకు ఎగుమతి అయ్యే బియ్యానికి ఇన్సెంటివ్ విధానాన్ని తెలంగాణ రాష్ట్రంలో త్వరలో ప్రవేశపెట్టనున్నట్లు రాష్ట్ర భారీ నీటిపారుదల, పౌరసరఫరాల శాఖల మంత్రి నలమాద ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు. శనివారం ఆయన నల్లగొండ జిల్లా మిర్యాలగూడలో నిర్వహించిన ఓ కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం నిర్మాణంలో ఉన్న ఎత్తిపోతల పథకాలను పరిశీలించారు. రైతులకు మేలు జరగాలనే ఉద్దేశంతో రైస్ మిల్లు నిర్మించడం సంతోషకరమన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా సైలో గోదాములను మహిళలే నిర్వహించే విధంగా ప్రభుత్వం ఆలోచన చేస్తోందన్నారు. రెండున్నరేళ్లలో పెండింగ్‌లో ఉన్న ఎస్‌ఎల్‌బీసీ, డిండి ప్రాజెక్టులను పూర్తి చేస్తామన్నారు. వాతావరణంలో ఎల్‌నినో ప్రభావం వల్ల వర్షాలు తగ్గే ప్రమాదం ఉందని, దీనిని దృష్టిలో ఉంచుకుని రైతులు పంటలను సాగు చేయాలని సూచించారు. కార్యక్రమంలో ఎమ్మెల్యేలు బత్తుల లక్ష్మారెడ్డి, వేముల వీరేశం, ఎమ్మెల్సీ శంకర్‌నాయక్, డీసీసీ అధ్యక్షుడు కై లాష్‌నేత, మాజీ ఎమ్మెల్యే తిప్పన విజయసింహారెడ్డి, ఆలిండియా రైస్ ఇండస్ట్రీ ఫెడరేషన్ అధ్యక్షుడు గుమ్మడి వెంకటేశం, మున్సిపల్ చైర్మన్ చిలుకూరి సుధాబాలకృష్ణ, వైస్ చైర్మన్ గుడిపాటి శిరీషనవీన్, మిల్లర్లు కర్నాటి రమేష్, గౌరు శ్రీనివాస్, గుండా మల్లయ్య, చకిలం రామయ్య, చిన్నపరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ఫ రాష్ట్రంలో త్వరలో ప్రవేశ పెడతాం
ఫ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి


