చివ్వెంల(సూర్యాపేట) : సీనియర్ల సహకారంతో జూనియర్లు న్యాయవాద వృత్తిలో రాణించాలని న్యాయవాద పరిషత్ జిల్లా అధ్యక్షుడు బాగాల నర్సింహ, సూర్యాపేట బార్ అసోషియేషన్ అధ్యక్షుడు నూకల సుదర్శన్‌రెడ్డి అన్నారు. సోమవారం బార్ అసోసియేషన్ హాల్లో నిర్వహించిన గురుపౌర్ణమి వేడుకల్లో సీనియర్ న్యాయవాదులను సత్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వృత్తిలో నిబద్ధత ముఖ్యమన్నారు. కార్యక్రమంలో సీనియర్ న్యాయవాదులు టి.భిక్షమయ్య గౌడ్, ఉమ్మెంతల వెంకటేశ్వర్‌రావు, టి.వేణుగోపాల్‌రావు, అనంతకుమార్. ఎస్. రామరాజు. తదితరులు పాల్గొన్నారు.


