రౌడీ షీటర్స్‌పై నిరంతర నిఘా | - | Sakshi
Sakshi News home page

రౌడీ షీటర్స్‌పై నిరంతర నిఘా

Jul 6 2026 1:46 AM | Updated on Jul 6 2026 1:46 AM

కోదాడ రూరల్‌ : రౌడీ షీటర్స్‌పై నిరంతర నిఘా ఉంచి వారు తిరిగి నేరాలకు పాల్పడకుండా కఠిన చర్యలు తీసుకోవాలని, పోలీస్‌ స్టేషన్‌కు వచ్చే ఫిర్యాదులపై వెంటనే స్పందించి బాధితులకు భరోసా కల్పించాలని ఎస్పీ నరసింహ ఆదేశించారు. వార్షిక తనిఖీల్లో భాగంగా ఆదివారం కోదాడ పట్టణ పోలీస్‌ స్టేషన్‌ను ఆయన తనిఖీ చేశారు. పోలీసుల కవాతు, వారికి డిపార్ట్‌మెంట్‌ నుంచి అందించిన సామగ్రిని పరిశీలించి పలు సూచనలు చేశారు. బాధితులు అందించే ఫిర్యాదులను పెండింగ్‌లో పెట్టకుండా దర్యాప్తును వేగవంతం చేయాలని సూచించారు. కోదాడ పట్టణంలోని ట్రాఫిక్‌ ఇబ్బందులు కలుగకుండా ఆపరేషన్‌ రోప్‌ కార్యక్రమాన్ని చేపట్టినట్లు తెలిపారు. పట్టణాన్ని సెక్టార్లుగా విభజించి నిరంతరం పోలీసు గస్తీ, పెట్రోలింగ్‌ నిర్వహించాలని, సీసీ కెమెరాల ఏర్పాటుకు స్థానికులను ప్రోత్సహించాలని సూచించారు. ఈ సందర్భంగా కార్యాలయ ఆవరణలో మొక్కను నాటారు. ఆయన వెంట డీఎస్పీ శ్రీనివాస్‌రెడ్డి, డీసీఆర్బీ డీఎస్పీ రవి, సీఐ మగ్దూంఅలీ, పట్టణ సీఐ శివశంకర్‌, ఎస్‌ఐలు అంజిరెడ్డి, సుధీర్‌, ఉపేందర్‌రెడ్డి, మల్సూర్‌, ఆర్‌ఎస్‌ఐ అశోక్‌, అంజన్‌రెడ్డి, శేఖర్‌రెడ్డి, సందీప్‌, ఆబేద్‌ ఉన్నారు.

ఎస్పీ నరసింహ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement