కేసుల సత్వర పరిష్కారానికే లోక్‌ అదాలత్‌ | - | Sakshi
Sakshi News home page

కేసుల సత్వర పరిష్కారానికే లోక్‌ అదాలత్‌

Jun 21 2026 8:04 AM | Updated on Jun 21 2026 8:04 AM

చివ్వెంల(సూర్యాపేట) : పెండింగ్‌ కేసుల సత్వర పరిష్కారానికే జాతీయ మెగా లోక్‌ అదాలత్‌ నిర్వహిస్తున్నట్లు జిల్లా ప్రధాన న్యాయమూర్తి పి.లక్ష్మీ శారద అన్నారు. శనివారం జిల్లా కోర్టు ప్రాంగణంలో నిర్వహించిన జాతీయ లోక్‌ అదాలత్‌లో ఆమె మాట్లాడారు. గ్రామాలు, పట్టణాలలో చిన్న పాటి ఘర్షణలకే పోలీస్‌ స్టేషన్‌లో కేసులు పెట్టుకొని కోర్టు మెట్లు ఎక్కుతున్నారన్నారు. ఇలాంటి వాటిని గ్రామాల్లోనే పెద్ద మనుషుల సమక్షంలో పరిష్కరించుకోవాలని సూచించారు. కింది కోర్టులో పరి ష్కారం కాని కేసులు సుప్రీం కోర్టులో పెండింగ్‌లో ఉన్న కేసులను సైతం జిల్లా కోర్టులో రాజీ మార్గం ద్వారా పరిష్కరించుకోవచ్చన్నారు. ఈ సందర్భంగా మొత్తం 5,868 కేసులు పరిష్కారమయ్యాయి. కక్షిదారులకు సీనియర్‌ న్యాయవాది వెంకటేశ్వర్‌రావు పులిహోర ప్యాకెట్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో జిల్లా మొదటి అదనపు జడ్జి పి.శివరామ్‌ ప్రసాద్‌, సీనియర్‌ సివిల్‌ జడ్జి ఫర్హీన్‌ కౌసర్‌, ప్రిన్సిపల్‌ జూనియర్‌ సివిల్‌ జడ్జి గోపు రజిత, మొదటి అదనపు జూనియర్‌ సివిల్‌ జడ్జి నాగూరి అపూర్వ రవళి, రెండవ అదనపు జూనియర్‌ సివిల్‌ జడ్జి మంచాల మమత, బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు సుదర్శన్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శి తల్లమళ్ల హస్సేన్‌, న్యాయవాదులు పాల్గొన్నారు.

ఫ జిల్లా ప్రధాన న్యాయమూర్తి లక్ష్మీశారద

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement