జాబ్‌మేళాలో 340 మంది ఎంపిక | - | Sakshi
Sakshi News home page

జాబ్‌మేళాలో 340 మంది ఎంపిక

Jul 15 2026 5:09 AM | Updated on Jul 15 2026 5:09 AM

నల్లగొండ : నల్లగొండలోని కోమటిరెడ్డి ప్రతీక్‌ మెమోరియల్‌ వృత్తి విద్యా జూనియర్‌ కళాశాలలో మంగళవారం అప్రెంటిస్‌షిప్‌–ఉద్యోగ మేళాను నిర్వహించారు. ఈ మేళాలో 25 సంస్థలకు చెందిన ప్రతినిధులు, అధికారులు పాల్గొని సుమారు 500 మంది విద్యార్థులకు ఇంటర్వ్యూలు నిర్వహించారు. ఇందులో 340 మంది విద్యార్థులు ఉద్యోగ అవకాశాలు పొందారు. ఈ సందర్భంగా డీఐఈఓ దస్రూనాయక్‌ మాట్లాడుతూ విద్యార్థులు త్వరగా ఉద్యోగ రంగంలో అడుగు పెట్టాలంటే అప్రెంటిస్‌ పూర్తి చేయడం ఎంతో అవసరమన్నారు. ఇందుకు ఉద్యోగ మేళాలు మంచి వేదికగా నిలుస్తాయని, విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కార్యక్రమంలో ఇంటర్మీడియట్‌ విద్యామండలి ఉద్యోగ మేళాల సమన్వయకర్త నండూరి శ్రీనివాస్‌, కళాశాల ప్రధానాచార్యులు ఎ.ఉపేందర్‌, సూర్యాపేట డీఐఈఓ బి.సులోచన రాణి, యాదాద్రి భువనగిరి జిల్లా నోడల్‌ అధికారి డి.సురేష్‌ రెడ్డి, వివిధ కళాశాలల ప్రధానాచార్యులు, అధ్యాపకులు, ఉమ్మడి జిల్లా నుంచి వచ్చిన నిరుద్యోగులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement