మున్సిపాలిటీల్లో ఆదాయ వనరులపై పాలకవర్గాలు దృష్టి సారించ
ఎస్సీ, ఎస్టీ ఉప ప్రణాళిక
సూర్యాపేట అర్బన్: మున్సిపాలిటీల్లో కొత్తగా ఏర్పడిన పాలకవర్గాలు వివిధ ఆర్థిక నిధులతో పట్టణ ప్రగతికి ప్రణాళిక తయారు చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సూర్యాపేట, కోదాడ, హుజూర్‌నగర్, నేరేడుచర్ల, తిరుమలగిరి మున్సిపాలిటీల్లో ప్రజలకు అవసరమైన మౌలిక వసతులు కల్పించేందుకు రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాల నుంచి వచ్చే ఆర్థిక నిధులతో పాటు స్థానికంగా వచ్చే ఆదాయ వనరులపై దృష్టి సారించాల్సి ఉంటుంది. ప్రభుత్వాల నుంచి, స్థానికంగా వచ్చే నిధులపై సమగ్ర వివరాలు.
పన్నుల ద్వారా ఆదాయం
ముఖ్యంగా ఆస్తి పన్నుతో మున్సిపాలిటీలకు ఆదాయం సమకూరుతుంది. అలాగే పబ్లిసిటీకి సంబంధించి విద్య తదితర సంస్థల హోర్డింగ్ లు, సైన్ బోర్డులు, ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తుంటారు. వాటి నుంచి వచ్చే ప్రకటన పన్నులపై ప్రత్యేక దృష్టి సారించాలి. నీటి పన్ను రాబట్టాలి. దుకాణాల లైసెన్స్‌లు, ట్రేడ్ లైసెన్సులు, హోటళ్లు, సినిమా థియేటర్ల అనుమతులకు రుసుం తీసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా కొత్తగా ఇంటి నిర్మాణాలు, షాపింగ్ కాంప్లెక్స్ సముదాయాలు, నిర్మాణ ప్లాన్ల ఆమోదానికి పన్నులు వసూలు చేస్తారు. మున్సిపాలిటీ నుంచి నిర్మించిన షాపింగ్ కాంప్లెక్స్ దుకాణాల అద్దెలు, సంతలు, మాంసం దుకాణాలు, తైబజార్ లాంటి వాటితో మున్సిపాలిటీకి ఆదాయం వస్తుంది.
14వ ఆర్థిక సంఘం నిధులు
కేంద్ర ప్రభుత్వం నుంచి ఏటా రెండు విడతలుగా మున్సిపాలిటీ జనాభాకు అనుగుణంగా 14వ ఆర్థిక సంఘం నిధులు విడుదల చేస్తుంది. ఇవి ప్రతి ఏటా ఏప్రిల్ మొదటి వారం, డిసెంబర్ చివరి వారంలో నేరుగా మున్సిపాలిటీ ఖాతాల్లో జమవుతాయి. వీటితో వివిధ వార్డుల్లో సీసీరోడ్లు నిర్మించే అవకాశం ఉంది
ప్లానింగ్, నాన్ ప్లానింగ్
మున్సిపాలిటీల అభివృద్ధికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వివిధ రకాల కార్యక్రమాలు అమలు చేస్తాయి. ముఖ్యంగా స్వచ్ఛభారత్, మన పట్టణ ప్రణాళిక కార్యక్రమాలు విజయవంతం చేసి ఆయా వార్డులో వివిధ అభివృద్ధి పనులు చేపట్టడానికి వినియోగిస్తారు.
స్టేట్ ఫైనాన్స్ నిధులు
జనాభా ప్రతిపాదికన మున్సిపాలిటీలకు రాష్ట్ర ప్రభుత్వం ఏటా స్టేట్ ఫైనాన్స్ నిధులు విడుదల చేస్తుంది. అయితే రెండు మూడేళ్లుగా ఇవి సక్రమంగా రావడం లేదు. తెలంగాణ స్టేట్ ఫైనాన్స్ పేరుతో డబ్బులు విడుదల చేస్తుంది. వీటిని పారిశుద్ధ్యానికి వివిధ రకాల పరికరాల కొనుగోలు చేసేందుకు ఖర్చు చేస్తారు. కౌన్సిల్ సమావేశంలో సభ్యుల తీర్మానం చేసిన తర్వాత ఈ నిధులను ఖర్చు చేయాలి. అడిషనల్ స్టేట్ ఫైనాన్స్ పేరుతో వచ్చే నిధులతో అభివృద్ధి పనులు చేపట్టేందుకు అవకాశం ఉంటుంది.
మున్సిపాలిటీల్లోని ఎస్సీ, ఎస్టీ వార్డుల్లో సీసీ రోడ్లు, ములుగు కాలువల నిర్మాణాలు తదితర అభివృద్ధి పనులు చేపట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీ ఉప ప్రణాళిక నిధులు మంజూరు చేస్తుంది. వీటిని ఆయా వర్గానికి చెందిన వార్డుల్లో మాత్రమే ఖర్చు చేయాల్సి ఉంటుంది. కొత్తగా ఎన్నికై న పాలకవర్గం మున్సిపాలిటీ ఆదాయ వనరులు పెంచుకొని ప్రజలకు మౌలిక వసతులతో పాటు మెరుగైన పాలన అందించేలా చర్యలు తీసుకోవాలని మున్సిపాలిటీ ప్రజలు కోరుతున్నారు.
మున్సిపాలిటీల్లో ఆదాయ వనరులపై పాలకవర్గాలు దృష్టి సారించ


