పెన్షనర్ల సమస్యలపై నిరంతర పోరాటం | - | Sakshi
Sakshi News home page

పెన్షనర్ల సమస్యలపై నిరంతర పోరాటం

Feb 22 2026 7:06 AM | Updated on Feb 22 2026 7:06 AM

పెన్షనర్ల సమస్యలపై నిరంతర పోరాటం

పెన్షనర్ల సమస్యలపై నిరంతర పోరాటం

నేరేడుచర్ల : నేరేడుచర్ల మండల కేంద్రంలోని పెన్షనర్ల భవనంలో శనివారం సామూహిక జన్మదిన వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఈ నెలలో జన్మించిన భువనగిరి లక్ష్మమ్మ, గుంపుల విజయతో కేక్‌ కట్‌ చేయించి సత్కరించారు. ఈ సందర్భంగా పెన్షనర్ల సంఘం నేరేడుచర్ల అధ్యక్షుడు చింతకుంట్ల పూర్ణచంద్రారెడ్డి మాట్లాడుతూ.. పెన్షనర్లు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి నిరంతరం పోరాటం చేస్తున్నామని తెలిపారు. హెల్త్‌కార్డులు లేని వారికి ప్రభుత్వం వెంటనే మంజూరు చేయాలన్నారు. 2024 ఏప్రిల్‌లో ఉద్యోగ విరమణ పొందిన పెన్షనర్లకు రావాల్సి న గ్రాట్యూటీ, ఏరియర్స్‌ చెల్లించాలని కోరారు. కార్యక్రమంలో లక్ష్మారెడ్డి, రంగారెడ్డి, లక్ష్మీకాంతమ్మ, సత్యనారాయణ, వీరభద్రారావు, వెంకటేశ్వర్లు, బుద్దారెడ్డి, సుందరయ్య, వీరారెడ్డి, మంగ్య, శ్రీరామ్‌రెడ్డి, జయసుందర్‌రావు, కృష్ణారావు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement