అరుణోదయ సమాఖ్య జిల్లా కార్యవర్గం ఎన్నిక | - | Sakshi
Sakshi News home page

అరుణోదయ సమాఖ్య జిల్లా కార్యవర్గం ఎన్నిక

Feb 22 2026 7:06 AM | Updated on Feb 22 2026 7:06 AM

అరుణో

అరుణోదయ సమాఖ్య జిల్లా కార్యవర్గం ఎన్నిక

అర్వపల్లి: అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య జిల్లా నూతన కార్యవర్గ ఎన్నిక శనివారం అర్వపల్లిలో నిర్వహించారు. జిల్లా అధ్యక్షుడిగా ఉదయగిరి, ఉపాధ్యక్షుడిగా బొల్లె వెంకన్న, ప్రధాన కార్యదర్శిగా కంచెనపల్లి సైదులు, సహాయ కార్యదర్శిగా ఎర్ర ఉమేష్‌, కోశాధికారిగా గుండు నాగేష్‌, కార్యవర్గ సభ్యులుగా తడకమళ్ల సంజీవ్‌, సామ నర్సిరెడ్డి, బోల్క పవన్‌ను ఎన్నుకున్నారు.

సీపీఆర్‌పై అవగాహన

సూర్యాపేటటౌన్‌ : కార్డియో పల్మోనరీ రిససిటేషన్‌ (సీపీఆర్‌)పై శనివారం జిల్లా కేంద్రంలోని డీఎంహెచ్‌ఓ కార్యాలయంలో ఆర్‌బీఎస్‌కె టీం సభ్యులకు అవగాహన కల్పించారు. శిక్షకులు డాక్టర్‌ లక్ష్మీప్రసన్న, డాక్టర్‌ నాగరాజు, డాక్టర్‌ శ్రీకాంత్‌వర్మ సీపీఆర్‌ గురించి వివరించారు. కార్యక్రమంలో డీఎంహెచ్‌ఓ డాక్టర్‌ పెండెం వెంకటరమణ, ఆర్‌బీఎస్‌కే టీం సభ్యులు, ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు.

పోలీస్‌ స్టేషన్‌కు చేరిన

ఇంటర్‌ ప్రశ్నపత్రాలు

సూర్యాపేటటౌన్‌ : ఇంటర్‌ పరీక్షలు ఈ నెల 25 జరగనుండడంతో ప్రశ్న పత్రాలు శనివారం సూర్యాపేట పోలీస్‌స్టేషన్‌కు చేరాయి. సూర్యాపేట డిస్ట్రిక్‌ బల్క్‌ నుంచి ఇన్‌చార్జి పెరుమాళ్ల యాదయ్య ఆధ్వర్యంలో మూడు రూట్ల ద్వారా ప్రశ్నపత్రాలను తరలించారు. సూర్యాపేట పట్టణంలోని 12 పరీక్షా కేంద్రాలకు సంబంధించిన ప్రశ్న పత్రాలను పట్టణ పోలీస్‌ స్టేషన్‌లోని స్ట్రాంగ్‌ రూంలో భద్రపరిచారు. స్ట్రాంగ్‌ రూంను డీఐఈఓ భానునాయక్‌, డీఈసీ సభ్యులు రాజమోహన్‌, దుర్గాప్రసాద్‌ సందర్శించారు.

ఎమ్మార్పీఎస్‌

జిల్లా కమిటీ రద్దు

కోదాడ: ఎమ్మార్పీఎస్‌ జిల్లా కమిటీని రద్దు చేస్తున్నట్లు జిల్లా కన్వీనర్‌ బచ్చలకూరి వెంకటేశ్వర్లు తెలిపారు. శనివారం కోదాడలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. కోదాడకు చెందిన కర్ల రాజేష్‌ మృతిపై ఎమ్మార్పీఎస్‌ మూడు నెలలుగా తీవ్ర స్థాయిలో ఉద్యమం చేస్తున్నా జిల్లా కమిటీ కనీస స్థాయిలో స్పందించలేదన్నారు. ఎమ్మార్పీఎస్‌ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ ఆదేశాలతో జిల్లా కమిటీని రద్దు చేస్తున్నామని తెలిపారు. అదే విధంగా ఎమ్మార్పీఎస్‌ జిల్లా నూతన కన్వీనర్‌గా కోదాడకు చెందిన ఏపూరి రాజును నియమిస్తున్నట్లు ప్రకటించారు. సమావేశంలో కొండపల్లి ఆంజనేయులు, యలమర్తి రాము, కోటేష్‌, రవి, కుటుంబరావు, చిన్న వెంకట్రావ్‌, సైదులు, కొండలు, శ్రీకాంత్‌, సూర్యప్రకాశ్‌ పాల్గొన్నారు.

27వరకు పత్తి కొనుగోళ్లు

భానుపురి (సూర్యాపేట) : సీసీఐ ఆధ్వర్యంలో ఈనెల 27వ తేదీ వరకు జిల్లాలోని రైతుల నుంచి పత్తిని కొనుగోలు చేయనున్నట్లు జిల్లా మార్కెటింగ్‌ అధికారి నాగేశ్వరశర్మ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. సీసీఐ ఈనెల 20వ తేదీ వరకే గడువు ఇవ్వగా రైతుల విజ్ఞప్తి మేరకు 27 వరకు పొడిగించించినట్లు పేర్కొన్నారు. రైతులు గమనించి తమ వద్ద ఉన్న పత్తిని విక్రయించేందుకు స్లాట్‌ బుక్‌ చేసుకుని రావాలని సూచించారు.

మట్టపల్లిలో విశేష పూజలు

మఠంపల్లి: మట్టపల్లి క్షేత్రంలో శనివారం అర్చకులు విశేష పూజలు నిర్వహించారు. దేవాలయంలో శ్రీలక్ష్మీనరసింహస్వామికి సుప్రభాతసేవ, నిత్యహోమం మూలవిరాట్‌కు పంచామృతాభిషేకం చేపట్టారు. శ్రీలక్ష్మీనరసింహస్వామి, అమ్మవార్లను వధూవరులుగా అలంకరించి ఎదుర్కోళ్ల మహోత్సవ సంవాదం జరిపించారు. అనంతరం రుత్విగ్వరణం, మధుఫర్కపూజ, మాంగల్యధారణ పూర్తిగావించారు.

అరుణోదయ సమాఖ్య జిల్లా కార్యవర్గం ఎన్నిక 1
1/2

అరుణోదయ సమాఖ్య జిల్లా కార్యవర్గం ఎన్నిక

అరుణోదయ సమాఖ్య జిల్లా కార్యవర్గం ఎన్నిక 2
2/2

అరుణోదయ సమాఖ్య జిల్లా కార్యవర్గం ఎన్నిక

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement