ప్రతినెలా వంద సెల్‌ఫోన్లు రికవరీ చేస్తున్నాం | - | Sakshi
Sakshi News home page

ప్రతినెలా వంద సెల్‌ఫోన్లు రికవరీ చేస్తున్నాం

Feb 22 2026 7:06 AM | Updated on Feb 22 2026 7:06 AM

ప్రతినెలా వంద సెల్‌ఫోన్లు రికవరీ చేస్తున్నాం

ప్రతినెలా వంద సెల్‌ఫోన్లు రికవరీ చేస్తున్నాం

సూర్యాపేటటౌన్‌ : ప్రతి నెలా వందకు పైగా సెల్‌ఫోన్లను రికవరీ చేసి బాధితులకు అందజేస్తున్నామని ఎస్పీ నరసింహ తెలిపారు. పొగొట్టుకున్న 107 మొబైల్స్‌ను శనివారం జిల్లా పోలీస్‌ కార్యాలయంలో బాధితులకు అందజేశారు. ఈసందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. మొబైల్‌ రికవరీ చేసేందుకు సైబర్‌ వారియర్స్‌ పోలీస్‌, టెక్నికల్‌ టీం పోలీసు సిబ్బంది కృషి చేస్తున్నారన్నారు. బిహార్‌, ఒడిశా, జార్ఖండ్‌ ఇతర రాష్ట్రాల నుంచి కూడా మొబైల్స్‌ను రికవరీ చేసినట్లు తెలిపారు. ఎవరైనా మొబైల్‌ పోగొట్టుకున్నా, చోరీకి గురైనా వెంటనే సీఈఐఆర్‌ పోర్టల్‌లో నమోదు చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో స్పెషల్‌ బ్రాంచ్‌ ఇన్‌స్పెక్టర్‌ రామారావు, ఐటీ కోర్‌ ఆర్‌ఎస్‌ఐ రాజశేఖర్‌ పాల్గొన్నారు.

ఫ ఎస్పీ నరసింహ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement