సీ్త్రల అభ్యుదయానికి బీఆర్ అంబేద్కర్ విశేష కృషి
సూర్యాపేట : సీ్త్రల అభ్యుదయం, మహిళా సాధికారతకు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ చేసిన సేవలు మరవలేనివని జిల్లా కోర్టు అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్ నాతి సవేందర్ కుమార్, జిల్లా కోర్టు పబ్లిక్ ప్రాసిక్యూటర్ కొంపెల్లి లింగయ్య యాదవ్ అన్నారు. శనివారం సంఘమిత్ర ఎడ్యుకేషనల్ చారిటబుల్ సొసైటీ అధ్యక్షుడు, న్యాయవాది తల్లమల్ల హసేన్ ఆధ్వర్యంలో స్పందన డిగ్రీ కళాశాలలో మాత రమాబాయి అంబేద్కర్ జయంతిని పురస్కరించుకొని మహిళా సాధికారికతపై సెమినార్ నిర్వహించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. కుల, మత వర్గాలకు అతీతంగా అన్ని వర్గాల మహిళల హక్కుల కోసం ప్రథమ న్యాయ శాఖ మంత్రిగా ఉన్న డాక్టర్ బీఆర్ అంబేద్కర్ హిందూ కోడ్ బిల్లు ప్రవేశపెట్టారని, ఆ బిల్లును తిరస్కరించిన ప్రభుత్వానికి నిరసనగా తన న్యాయశాఖ మంత్రికి రాజీనామా చేసిన గొప్ప త్యాగశీలి అని కొనియాడారు. అనంతరం డాక్టర్ బీఆర్ అంబేద్కర్ తీసుకొచ్చిన మహిళా విముక్తి ప్రదాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ పుస్తకాన్ని ఆవిష్కరించారు. కార్యక్రమంలో తల్లమల్ల యాదమ్మ, రచయిత డి.నటరాజ్ అదనపు జిల్లా కోర్టు పబ్లిక్ ప్రాసిక్యూటర్ శశిధర్, డాక్టర్ కె.రంగారెడ్డి సీనియర్ సీనియర్ న్యాయవాదులు వసంత సత్యనారాయణ పిళ్లే యాదవ్, రమాదేవి, అశోక్, కళాశాల కరస్పాండెంట్ శ్రీనివాస్ రెడ్డి, లీల, అఖిల్ పాల్గొన్నారు.


