కోదాడరూరల్ : కోదాడ ప్రాంతీయ పశువైద్యశాలలో పశు ఔషధ బ్యాంక్ ఏర్పాటు చేసి దాని ద్వారా పశుపోషకులకు చేస్తున్న సేవలు ప్రశంసనీయమని జిల్లా పశువైద్యాధికారి డాక్టర్ బోడెపూడి శ్రీనివాసరావు అన్నారు. ఆదివారం ఆయన కోదాడ పశువైద్యశాలను సందర్శించి మాట్లాడారు. దేశంలో ఎక్కడా లేని విధంగా పశుఔషధ బ్యాంక్ ఏర్పాటు చేసి రూ.1.55 లక్షల రివాల్వింగ్ ఫండ్‌తో రూ.9.43కోట్ల సంపదను సృష్టించడం గొప్ప విషయమన్నారు. 20 ఏళ్ల క్రితం కోదాడ పశువైద్యశాలలో తాను అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేసిన విషయాన్ని గుర్తు చేసుకున్నారు. అనంతరం రికార్డులను పరిశీలించారు. ఆయన వెంట పశువైద్యశాల అసిస్టెంట్ డైరెక్టర్ డాక్టర్ పెంటయ్య, కాపుగల్లు పశువైద్యాధికారి డాక్టర్ సిరిపురపు సురేంద్ర, పశువైద్య కేంద్రం సిబ్బంది ఉన్నారు.
జిల్లా పశువైద్యాధికారి శ్రీనివాసరావు


