పనులు నాసిరకంగా చేస్తున్నారంటూ.. | - | Sakshi
Sakshi News home page

పనులు నాసిరకంగా చేస్తున్నారంటూ..

Mar 9 2026 7:17 AM | Updated on Mar 9 2026 7:17 AM

నడిగూడెం : మండలంలోని కరివిరాలలో రూ.10 లక్షలతో నిర్మిస్తున్న మహిళా సమాఖ్య భవనం పనులు నాసిరకంగా చేస్తున్నారని ఆరోపిస్తూ అదే గ్రామానికి చెందిన డీవైఎఫ్‌ఐ నాయకుడు కేశగాని భద్రయ్య ఆదివారం పనులను అడ్డుకున్నాడు. సంబంధిత అధికారులకు ఫోన్‌ ద్వారా సమాచారం ఇచ్చాడు. అధికారులెవరూ రాకపోగా పనులు అడ్డుకున్న తనపైనే కొందరు సిమెంట్‌ కాంక్రీటు పోశారని భద్రయ్య ఆవేదన వ్యక్తం చేశాడు.

బాలికలకు

హెచ్‌పీవీ వ్యాక్సిన్‌

సూర్యాపేటటౌన్‌ : గర్భాశయ ముఖ ద్వారా క్యాన్సర్‌ నుంచి రక్షణ కోసం 14 నుంచి 15 సంవత్సరాలలోపు బాలికలకు హెచ్‌పీవీ వ్యాక్సి న్‌ను ప్రభుత్వం ఉచితంగా అందిస్తుందని డీఎంహెచ్‌ఓ డాక్టర్‌ పెండెం వెంకటరమణ అన్నారు. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో హెచ్‌పీవీ టీకా కార్యక్రమాన్ని ఆదివారం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జనరల్‌ ఆసుపత్రిలో ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ షెడ్యూల్‌ ప్రకారం వ్యాక్సినేషన్‌ ప్రక్రియ కొనసాగుతుందన్నారు. కార్యక్రమంలో ప్రోగ్రామ్‌ అధికారి డాక్టర్‌ కోటిరత్నం, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.

గిరి ప్రదక్షిణలో

కూచిపూడి నృత్య ప్రదర్శన

యాదగిరిగుట్ట రూరల్‌ : హైదరాబాద్‌కు చెందిన 12 ఏళ్ల కూచిపూడి నర్తకి పి.వైష్ణోదేవి యాదగిరీశుడి కొండ చుట్టూ కూచిపూడి నృత్యం చేస్తూ గిరి ప్రదక్షిణ చేసింది. సంస్కృతి, ఆధ్యాత్మికతను సమ్మిళితం చేస్తూ, 3 కిలోమీటర్లు గిరి ప్రదక్షిణ మార్గమంతా నృత్యం చేస్తూ భక్తులను ఆకట్టుకుంది. జ్యోతి కళాక్షేత్రం స్కూల్‌ఆఫ్‌ ఆర్ట్స్‌ ఆధ్వర్యంలో వైష్ణోదేవి ఈ ప్రదర్శన ఇచ్చారు. ఆమెను ప్రభుత్వ విప్‌ బీర్ల అయిలయ్య అభినందించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement