హుజూర్‌నగర్ : మోడల్ హౌసింగ్ కాలనీలో పెండింగ్ పనులను త్వరగా పూర్తి చేయాలని కలెక్టర్ తేజస్ నంద్‌లాల్ పవార్ అన్నారు. మంగళవారం హుజూర్‌నగర్ పరిధిలోని రామస్వామి గుట్టవద్ద నిర్మిస్తున్న ఇందిరమ్మ ఇళ్ల మోడల్ హౌసింగ్ కాలనీని ఆయన పరిశీలించారు. ఇళ్ల బ్లాకులు, అంతర్గత రోడ్లు, సభాస్థలి, మొక్కలు నాటింపు, పార్కింగ్ స్థలాన్ని పరిశీలించారు. ఈ నెల రెండవ వారంలో సీఎం రేవంత్‌రెడ్డి చేతుల మీదుగా కాలనీని ప్రారంభించనున్నట్లు ఆయన తెలిపారు. ఇళ్ల లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ పారదర్శకంగా ఉండాలని, అర్హతలేని వారి పేరు జాబితాలో ఉండకూడదని స్పష్టం చేశారు. జాబితాను సూక్ష్మంగా పరిశీలించి అవకతవకలకు తావు లేకుండా ఎంపిక ప్రక్రియ చేపట్టాలని ఆదేశించారు. ఆయన వెంట హౌసింగ్ పీడీ సిద్ధార్థ, హార్టికల్చర్ పీడీ నాగయ్య, ఆర్డీఓ శ్రీనివాసులు, మిషన్ భగీరథ ఈఈ కరుణాకర్‌రెడ్డి, ట్రాన్స్‌కో డీఈ వెంకటకృష్టయ్య, మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్, తహసీల్దార్ కవిత పాల్గొన్నారు


