సూర్యాపేట అర్బన్ : రాష్ట్ర ప్రభుత్వం యాసంగి రైతు భరోసా నిధులను వెంటనే విడుదల చేయాలని రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు మల్లు నాగార్జునరెడ్డి డిమాండ్ చేశారు. మంగళవారం సూర్యాపేటలోని సంఘం కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రైతులకు పెట్టుబడి సాయం కింద ఎకరాకు రూ.15వేలు ఇస్తామని కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు వాగ్దానం చేసిందని, అధికారంలోకి వచ్చిన తర్వాత శూన్య హస్తం చూపిస్తుందని విమర్శించారు. రైతు భరోసా నిధుల కోసం ఈ నెల 12న సూర్యాపేట కలెక్టరేట్ ఎదుట నిర్వహించే ధర్నాను విజయవంతం చేయాలని కోరారు. సమావేశంలో నాయకులు కందాల శంకర్‌రెడ్డి, కొలిశెట్టి యాదగిరిరావు, రజిత, అప్పయ్య పాల్గొన్నారు.


