ప్రశాంతంగా గురుకుల ప్రవేశ పరీక్ష
తుంగతుర్తి : గురుకుల ప్రవేశ పరీక్ష ఆదివారం ప్రశాంతంగా ముగిసింది. 2026–27 విద్యా సంవత్సరానికి గాను గురుకులాల్లో చేరే విద్యార్థులకు ప్రవేశ పరీక్షలు నిర్వహించారు. మండల కేంద్రంలో రెండు పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశారు. గిరిజన బాలికల గురుకుల పాఠశాలలో 360 మంది ప్రవేశపరీక్ష రాయాల్సి ఉండగా 338 మంది పరీక్షకు హాజరయ్యారు. తెలంగాణ సాంఘిక సంక్షేమ బాలికల గురుకుల పాఠశాలలో 504 మంది విద్యార్థులు పరీక్షకు హాజరు కావలసి ఉండగా 471 మంది విద్యార్థులు హాజరయ్యారు.


