సూర్యాపేటలో స్కానింగ్ సెంటర్ సీజ్
సూర్యాపేట టౌన్ : నిబంధనలకు విరుద్ధంగా కొనసాగుతున్న జిల్లా కేంద్రంలోని ఆఫిల్ డయాగ్నోస్టిక్స్ అండ్ స్కాన్ సెంటర్‌ను శనివారం వైద్యశాఖ అధికారులు సీజ్ చేశారు. ఈ సందర్భంగా జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారి (డీఎంహెచ్‌ఓ) డాక్టర్ పెండెం వెంకటరమణ మాట్లాడారు. ఈ సెంటర్‌లో సోనాలజిస్ట్‌గా పనిచేస్తున్న డాక్టర్ సోమ కిరణ్ విషయమై హైకోర్టు ఉత్తర్వులు మేరకు కలెక్టర్ అధ్యక్షతన ఏర్పాటైన కమిటీ పునర్విచారణ చేసినట్టు పేర్కొన్నారు. కమిటీ సమగ్రంగా విచారణ జరిపి డాక్టర్ సోమ కిరణ్ సోనాలజిస్ట్‌గా ప్రాక్టీస్ చేసేందుకు అర్హులు కాదని తేల్చినట్టు చెప్పారు. కమిటీ నివేదిక ఆధారంగా నిబంధనల ప్రకారం ఆపిల్ డయాగ్నోస్టిక్స్ అండ్ స్కానింగ్ సెంటర్‌ను సీజ్ చేసినట్టు పేర్కొన్నారు. జిల్లాలో చట్ట విరుద్ధంగా అల్ట్రాసౌండ్, స్కాన్ సేవలు అందిస్తున్న వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.


