నేడు మంత్రి ఉత్తమ్‌ రాక | - | Sakshi
Sakshi News home page

నేడు మంత్రి ఉత్తమ్‌ రాక

Mar 1 2026 7:42 AM | Updated on Mar 1 2026 7:42 AM

నేడు

నేడు మంత్రి ఉత్తమ్‌ రాక

హుజూర్‌నగర్‌ : రాష్ట్ర నీటిపారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి ఎన్‌.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఆదివారం హుజూర్‌నగర్‌ రానున్నారు. మంత్రి సాయంత్రం 4 గంటలకు పట్టణానికి చేరుకుని రామస్వామి గుట్ట హౌసింగ్‌ కాలనీలో ఇళ్ల నిర్మాణ పనులను పరిశీలిస్తారు. అనంతరం పనుల పురోతిపై వివిధ శాఖల ఉన్నతాధికారులతో సమీక్షిస్తారు. సాయంత్ర 6 గంటలకు హైదరాబాద్‌కు వెళ్తారు.

శ్రమ దోపిడీని అరికట్టాలి

సూర్యాపేట అర్బన్‌ : అదనపు పని గంటలు పెంచుతూ శ్రామిక వర్గ మహిళల శ్రమను దోచుకునే విధానాలను ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వం విడనాడాలని ప్రగతిశీల మహిళా సంఘం (పీఓడబ్ల్యూ) జిల్లా ప్రధాన కార్యదర్శి కంచర్ల నర్సమ్మ కోరారు. శనివారం సూర్యాపేటలోని చండ్ర పుల్లారెడ్డి విజ్ఞాన కేంద్రంలో అంతర్జాతీయ శ్రామిక మహిళా పోరాట దినం కార్యక్రమాలు జయప్రదం చేయాలని రూపొందించిన పోస్టర్‌ను ఆవిష్కరించి మాట్లాడారు. శ్రామిక మహిళల ఉపాధిపై మోదీ ప్రభుత్వం జరుపుతున్న దాడికి వ్యతిరేకంగా ఈ నెల 8న మహిళా దినోత్సవం సందర్భంగా అంతర్జాతీయ శ్రామిక మహిళా పోరాట దినాన్ని గ్రామ గ్రామాన జరుపుకోవాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో పీఓడబ్ల్యూ జిల్లా ఉపాధ్యక్షురాలు అలుగుబెల్లి వాణి, జిల్లా సహాయ కార్యదర్శి శంగం రామలింగక్క, కోశాధికారి కావ్య, జిల్లా కమిటీ సభ్యులు శాంతమ్మ, సైదమ్మ, నీలమ్మ, కూసు జయసుధ, సామ ఉపేంద్ర, ఎరబ్రోయిన మంగమ్మ పాల్గొన్నారు.

‘ఉపాధి’పై కేంద్ర

బృందం సమీక్ష

సూర్యాపేట : జిల్లాలోని వివిధ గ్రామాల్లో ఈనెల 26 నుంచి ఉపాధి హామీ పథకం పనులను పరిశీలించిన కేంద్ర బృందం సభ్యులు శనివారం సూర్యాపేట కలెక్టరేట్‌లో కలెక్టర్‌ తేజస్‌ నంద్‌లాల్‌ పవార్‌తో సమావేశమయ్యా రు. ఈ సందర్భంగా తాము పరిశీలించిన ఉపాధి పనుల వివరాలను కేంద్రం సభ్యుల కమిటీలో సీనియర్‌ అడ్మినిస్ట్రేటివ్‌ ఆఫీసర్‌ సంజయ్‌ కుమార్‌.. కలెక్టర్‌కు వివరించారు. అనంతరం కేంద్ర బృందం సభ్యులను కలెక్టర్‌ సన్మానించారు. ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు దిల్‌ కుష్‌ మీనా, సంజయ్‌ పాండే, జాగృతిరాయ్‌ తదితరులు పాల్గొన్నారు.

గోదావరి జలాలు తగ్గింపు

అర్వపల్లి : యాసంగి సీజన్‌కు గాను వారబందీ విధానంలో జిల్లాకు 1,700 క్యూసెక్కుల గోదావరి జలాలు విడుదల చేస్తుండగా శని వారం వాటిని 1,613 క్యూసెక్కులకు తగ్గించారు. ప్రస్తుతం వస్తున్న నీళ్లను వృథా చేయకుండా పంటలకు వాడుకోవాలని జలవనరుల శాఖ ఈఈ సత్యనారాయణగౌడ్‌, ఏఈ చంద్రశేఖర్‌ రైతులకు సూచించారు.

ఇంటర్‌ ప్రశ్నపత్రాల పరిశీలన

నేరేడుచర్ల : నేరేడుచర్లలోని ప్రభుత్వ, స్పందన జూనియర్‌ కళాశాలల్లో ఏర్పాటు చేసిన ఇంటర్‌ పరీక్ష కేంద్రాలను శనివారం ఇంటర్‌ బోర్డు రాష్ట్ర అధికారి హేమచందర్‌ ఆకస్మికంగా తని ఖీ నిర్వహించారు. అనంతరం స్థానిక పోలీస్‌ స్టేషన్‌లో ఇంటర్‌ ప్రశ్నపత్రాలను పరిశీ లించారు. ఆయన వెంట డీఐఈఓ భానునాయక్‌, డీఈసీ సభ్యులు మోహన్‌రావు ఉన్నారు.

పారిశ్రామికవేత్తలుగా ఎదగాలి

నల్లగొండ టూటౌన్‌ : విద్యార్థులు పారిశ్రామిక వేత్తలుగా ఎదగాలని రిజిస్ట్రార్‌ కొప్పుల అంజిరెడ్డి అన్నారు. శనివారం నల్లగొండలోని ఎంజీ యూనివర్సిటీలో ఎంబీఏ ఫైనలియర్‌ విద్యార్థులకు వ్యాపార అభివృద్ధి అవకాశాలపై ఏర్పాటు చేసిన అవగాహన సమావేశంలో ఆయన మాట్లాడారు. విద్యార్థులు పరిశ్రమల స్థాపన, ఉపాధి కల్పనపై దృష్టి సారించాలని సూచించారు. కార్యక్రమంలో పరిశ్రమల శాఖ జిల్లా మేనేజర్‌ సతీష్‌కుమార్‌, చార్టెడ్‌ అకౌంటెంట్‌ పిల్లి మహేష్‌, ఇండస్ట్రీ ఇనిస్టిట్యూట్‌ కనెక్ట్‌ డైరెక్టర్‌ జక్కా సురేష్‌రెడ్డి, శ్రీదేవి, సబీనా హెరాల్డ్‌, విద్యార్థులు పాల్గొన్నారు.

నేడు మంత్రి ఉత్తమ్‌ రాక1
1/1

నేడు మంత్రి ఉత్తమ్‌ రాక

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement