నిరుపయోగం.. నీటిశుది్ధ కేంద్రం | - | Sakshi
Sakshi News home page

నిరుపయోగం.. నీటిశుది్ధ కేంద్రం

Mar 1 2026 7:42 AM | Updated on Mar 1 2026 7:42 AM

నిరుప

నిరుపయోగం.. నీటిశుది్ధ కేంద్రం

టేకుచెట్ల సంరక్షణ బాధ్యత తీసుకుంటాం అసాంఘిక కార్యకలాపాలను అరికట్టాలి

మంచినీటి శుద్ధి కేంద్రంలో ఉపాధిహామీ పనుల్లో భాగంగా నాటిన టేకు మొక్కల సంరక్షణ ఇప్పటి నుంచి గ్రామ పంచాయతీ తీసుకుంటుంది. గ్రామ పంచాయతీ ఆస్తులను చోరీ చేస్తే చర్యలు తీసుకుంటాం. భవనాల్లో ఇతర కార్యాలయాలు నిర్వహించేలా ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తాం.

–నందిగామ శ్రీనివాసులు,

సర్పంచ్‌, వాయిలసింగారం

మూతబడిన నీటిశుద్ధి కేంద్రంలో అసాంఘిక కార్యకలాపాలను అరికట్టేందుకు చర్యలు చేపట్టాలి. ఈ కేంద్రం గ్రామానికి 1.5 కిలోమీటర్ల దూరంలో ఉన్నందున భవనాల్లో పేకాట ఆడడం, మద్యం తాగడం వంటివి చేస్తున్నారు. గ్రామ అవసరాలకు భవనాలను వినియోగంలోకి తీసుకురావాలి.

–కొల్లు సుబ్బారావు, సామాజిక కార్యకర్త, వాయిలసింగారం

అనంతగిరి : నలభై గ్రామాలకు 12 ఏళ్లపాటు తాగునీరు అందించిన నీటిశుద్ధి కేంద్రం నేడు నిరుపయోగంగా మారింది. ప్రస్తుతం ఆ కేంద్రంలోని భవనాలు అసాంఘిక కార్యకలాపాలకు నిలయంగా మారాయ ని ప్రజలు ఆరోపిస్తున్నారు. అయినా నీటిశుద్ధి కేంద్రం కోసం నిర్మించిన భవనాలను వినియోగంలోకి తేవడంపై అధికారులు మీనమేషాలు లెక్కిస్తున్నారు.

నీటిశుద్ధి కేంద్రం ఏర్పాటు ఇలా..

గతంలో కోదాడ, హుజూర్‌నగర్‌ పరిసర గ్రామాల ప్రజలు ప్రతి వేసవిలోనూ తాగునీటికి ఇబ్బందులు పడుతుండేవారు. ఈ నేపథ్యంలో తీవ్ర నీటి ఎద్దడి ఉన్న 40 గ్రామాలను గుర్తించి ఆయా గ్రామాలకు తాగునీరు అందించే లక్ష్యంతో అనంతగిరి మండలం వాయిలసింగారంలో 2004లో నాటి కోదాడ ఎమ్మెల్యే ఉత్తమ్‌కుమార్‌రెడ్డి హయాంలో రూ.19 కోట్ల వ్యయంతో మంచినీటి శుద్ధి కేంద్రాన్ని నిర్మించారు. ఈ కేంద్రం ద్వారా దాదాపు 12 సంవత్సరాల పాటు 40 గ్రామాలకు ఆర్‌డబ్ల్యూఎస్‌ శాఖ ఆధ్వర్యంలో మంచినీరు అందించారు. దీంతో ఈ ప్రాజెక్టు నలభై గ్రామాల్లో మంచినీటి కొరతను తీర్చింది.

‘భగీరథ’తో మూతపడిన కేంద్రం..

2016 ఆగస్టు 7న రాష్ట్ర ప్రభుత్వం మిషన్‌ భగీరథ పథకం అమలులోకి తీసుకువచ్చిన తరువాత వాయిలసింగారంలో నిర్మించిన నీటిశుద్ధి కేంద్రం పూర్తిగా మూతబడిపోయింది. వినియోగంలో లేకపోవడంతో ప్రాజెక్టుకు సంబంధించి విద్యుత్‌ మోటార్లు, యంత్ర సామగ్రి చోరీకి గురయ్యాయి. భవనాలు పదిలంగా ఉన్నప్పటికీ ఐరన్‌ డోర్లు, భవనాలకు అమర్చిన స్విచ్‌ బోర్డులు, విద్యుత్‌ వైర్లు చోరీకి గురవుతున్నాయి. ఈ నేపథ్యంలో మిగిలిన మోటార్లు, యంత్ర సామగ్రిని ఆర్‌డబ్ల్యూఎస్‌ అధికారులు స్క్రాప్‌గా విక్రయించారు. దీంతో ఎటువంటి రక్షణ లేకుండా ఉన్న భవనాలు నేడు పేకాట, మద్యం తాగడం, ఇతర అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారాయి. భవనంలో ఎక్కడ చూసినా పేకలు, మద్యం సీసాలు, గుట్కా ప్యాకెట్‌లు దర్శనమిస్తున్నాయి.

మాయమవుతున్న టేకుచెట్లు

ఉపాధిహామీ పనుల్లో భాగంగా ఈ నీటిశుద్ధి కేంద్రంలో గతంలో 500 టేకు మొక్కలు నాటారు. అవి ఇప్పుడు పెరిగి పెద్ద చెట్లుగా ఎదిగాయి. వీటిలో ఇప్పటివరకు సుమారు 250 టేకు చెట్లను గుర్తుతెలియని వ్యక్తులు నరికి అపహరించుకెళ్లారు. గ్రామానికి సుమారు 1.5 కిలోమీటర్ల దూరంలో ఉన్నందున ఇక్కడ ఉన్న భవనాలు, టేకు చెట్లకు రక్షణ లేకుండా పోయింది. ప్రస్తుతం మరో 250 టేకు చెట్లు మిగిలి ఉన్నాయి. అధికారులు స్పందించి ఉన్న టేకు చెట్లను కాపాడడంతోపాటు భవనాలను వినియోగంలోకి తేవాలని గ్రామస్తులు కోరుతున్నారు.

ఫ 40 గ్రామాలకు పుష్కర కాలం తాగునీరు అందించిన ప్రాజెక్టు

ఫ ‘మిషన్‌ భగీరథ’తో

పట్టించుకోని యంత్రాంగం

ఫ సామగ్రి, పలు యంత్ర

పరికరాలు, టేక కలప అపహరణ

ఫ భవనాలను వినియోగంలోకి తేవాలంటున్న

వాయిలసింగారం ప్రజలు

నిరుపయోగం.. నీటిశుది్ధ కేంద్రం1
1/3

నిరుపయోగం.. నీటిశుది్ధ కేంద్రం

నిరుపయోగం.. నీటిశుది్ధ కేంద్రం2
2/3

నిరుపయోగం.. నీటిశుది్ధ కేంద్రం

నిరుపయోగం.. నీటిశుది్ధ కేంద్రం3
3/3

నిరుపయోగం.. నీటిశుది్ధ కేంద్రం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement