నేడు ఉచిత మెగా కంటి వైద్య శిబిరం | - | Sakshi
Sakshi News home page

నేడు ఉచిత మెగా కంటి వైద్య శిబిరం

Mar 1 2026 7:42 AM | Updated on Mar 1 2026 7:42 AM

నేడు ఉచిత మెగా కంటి వైద్య శిబిరం

నేడు ఉచిత మెగా కంటి వైద్య శిబిరం

సూర్యాపేట టౌన్‌ : సూర్యాపేట జిల్లా కేంద్రంలోని బ్రాహ్మణ కల్యాణ మండపంలో ఆదివారం తమ ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో ఉచిత మెగా కంటి వైద్య శిబిరం నిర్వహిస్తున్నట్టు అక్షర ఫౌండేషన్‌ ప్రధాన కార్యదర్శి రుద్రంగి కాళిదాస్‌ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ కంటి వైద్య శిబిరంలో అన్ని కంటి సమస్యలు చూడబడతాయని, ఉచిత ఆపరేషన్‌తో పాటు భోజన వసతి, రవాణా సౌకర్యం కల్పించబడుతుందని పేర్కొన్నారు. ఆపరేషన్‌ చేయించుకున్న వారికి 15 రోజుల తర్వాత చెకప్‌ కూడా చేయబడుతుందని పేర్కొన్నారు. ఆపరేషన్‌ అవసరం ఉన్నవారు ఆధార్‌ కార్డు జిరాక్స్‌ కాపీలు తెచ్చుకోవాలని సూచించారు. ఇతర కంటి సమస్యలు ఉన్నవారికి ఉచితంగా మందులు అందజేస్తామని, పూర్తి వివరాలకు గడ్డం వీరబాబు సెల్‌ : 7036259911 నంబర్‌ను సంప్రదించాలని కోరారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement