సొంతింటి కల నెరవేరింది..
చాలాకాలంగా ఇంటిని నిర్మించుకోవాలని ఆలోచన చేస్తున్నాం. కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని ప్రవేశపెట్టడంతో మాకు ఇల్లు మంజూరైంది. దీంతో ఇంటి నిర్మాణ పనులు చేపట్టాం. నా భర్త తాపీ మేసీ్త్ర కావడంతో ప్రభుత్వం అందజేసిన నగదుకుతోడు మరికొంత సమకూర్చుకుని మేము అనుకున్నవిధంగా ఇంటిని నిర్మించుకుని సొంతింటి కళ నెరవేర్చుకుంటున్నాం. – చిక్కుళ్ల సుజాత, కెఆర్సీపురం
ప్రభుత్వానికి రుణపడి ఉంటాం
కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఇందిరమ్మ ఇళ్ల పథకంలో మేము ఇల్లు నిర్మించుకున్నాం. ప్రభుత్వం అందజేసిన రూ.5లక్షల నగదు మాకు ఎంతో ఉపయోగపడింది. ఆ నగదుతోపాటు కొంత కలుపుకుని ఇంటిని నిర్మించుకున్నాం. రాష్ట్ర ప్రభుత్వం చేసిన సహాయానికి మేము రుణపడి ఉంటాం.
– చింత విజయ, గుడిబండ
సొంతింటి కల నెరవేరింది..


