బుద్ధవనం సందర్శించిన బుద్ధిస్ట్‌ స్కాలర్లు | - | Sakshi
Sakshi News home page

బుద్ధవనం సందర్శించిన బుద్ధిస్ట్‌ స్కాలర్లు

Mar 15 2026 4:54 AM | Updated on Mar 15 2026 4:54 AM

నాగార్జునసాగర్‌ : సాగర్‌లోని బుద్ధవనాన్ని శనివారం ఏపీలోని నాగార్జున విశ్వవిద్యాలయంలో బౌద్ధంపై పీహెచ్‌డీ చేస్తున్న మయన్మార్‌తో పాటు పలు దేశాలకు చెందిన బుద్ధిస్ట్‌ స్కాలర్లు సందర్శించారు. బుద్ధచరిత వనంలోని గౌతమ బుద్ధుడి పాదాల వద్ద పుష్పాంజలి ఘటించారు. అనంతరం బుద్ధచరితవనం, జాతక వనం, ధ్యాన వనం, స్థూప వనం సందర్శించారు. మహాస్థూపంలోని సమావేశ మందిరంలో బుద్ధవనం లఘుచిత్రాన్ని వీక్షించారు. ధ్యాన మందిరంలో ధ్యానం చేశారు. అష్ట బుద్ధుల వద్ధ బుద్ధజ్యోతి వెలిగించి హారతి ఇచ్చారు. అదేవిధంగా నాగార్జునకొండకు వెళ్లారు. ఈ కార్యక్రమంలో నాగార్జున విశ్వవిద్యాలయం బౌద్ధ అధ్యయన విభాగం పూర్వ విద్యార్థి, బుద్ధవనం ఎస్టేట్‌ మేనేజర్‌ రవిచంద్ర, ప్రశాంత్‌, బుద్ధవనం ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌ శాసన, బుద్ధభూమి, బౌద్ధమాస పత్రిక అధ్యక్షుడు, ఎడిటర్‌ సీతారామయ్య, స్థానిక టూరిజం గైడ్‌ సత్యనారాయణ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement