క్రీడల్లో సత్తాచాటారు | - | Sakshi
Sakshi News home page

క్రీడల్లో సత్తాచాటారు

Feb 27 2026 4:07 AM | Updated on Feb 27 2026 4:07 AM

క్రీడల్లో సత్తాచాటారు

క్రీడల్లో సత్తాచాటారు

సూర్యాపేట టౌన్‌ : శాంతి భద్రతలే లక్ష్యంగా నిరంతరం పోలీసులుగా విధులు నిర్వహిస్తున్న కొందరు కానిస్టేబుళ్లు కీడ్రాపోటీల్లోనూ రాణిస్తున్నారు. ప్రతి ఏడాది మాదిరిగానే పోలీస్‌ శాఖ ఇటీవల హైదరాబాద్‌లో జరిగిన 4వ రాష్ట్ర పోలీస్‌ క్రీడోత్సవాలు నిర్వహించింది. ఈ పోటీల్లో యాదాద్రి జోన్‌ తరఫున ఆడిన జిల్లా క్రీడాకారులు వివిధ క్రీడాంశాల్లో బహుమతులు సాధించారు.

రాణించిన మహిళా పోలీసులు

రాష్ట్ర స్థాయి పోలీస్‌ క్రీడల్లో జిల్లా మహిళా పోలీసులు సత్తాచాటారు. రాష్ట్ర స్థాయి క్రీడల్లో యాదాద్రి జోన్‌ కబడ్డీ పోటీల్లో మహిళా విభాగంలో ప్రథమ స్థానం, వాలీబాల్‌ లో మహిళా విభాగంలో తృతీయ స్థానం సాధించారు. బ్యాడ్మింటన్‌లో మహిళా విభాగంలో తృతీయ స్థానం సాధించి బహుమతులు గెలుచుకున్నారు. కబడ్డీ జట్టులో జిల్లా నుంచి మహిళా కానిస్టేబుళ్లు దీపిక, అనూష, శిరీష, దివ్యభారతి పాల్గొని అత్యత్తుమ ప్రతిభ కనబరిచారు. అలాగే వాలీబాల్‌ జట్టులో మహిళా కానిస్టేబుళ్లు లావణ్య, ప్రియాంక, దివ్యభారతి, దీపిక, ప్రవళ్లిక, అనూష, శిరీష పాల్గొని జట్టును ద్వితీయ స్థానంలో నిలిపారు. బ్యాడ్మింటన్‌లో మహిళా కానిస్టేబుల్‌ అనూష తృతీయ స్థానం సాధించి బహుమతి గెలుచుకుంది. పురుషుల విభాగంలో అథ్లెటిక్స్‌లో ఆర్‌ఎస్‌ఐ మహేష్‌ 1,500 మీటర్ల విభాగంలో గోల్డ్‌ మెడల్‌, ఐదు కిలోమీటర్ల విభాగంలో సిల్వర్‌ మెడల్‌ సాధించారు. అలాగే కానిస్టేబుల్‌ స్వామి జావెలిన్‌ త్రోలో గోల్డ్‌ మెడల్‌ సాధించారు.

జాతీయ స్థాయి క్రీడలకు ఎంపిక

జాతీయ స్థాయి పోలీస్‌ క్రీడాపోటీలకు పలువురు జిల్లా క్రీడాకారులు ఎంపికయ్యారు. ఆత్మకూరు పోలీస్‌స్టేషన్‌కు చెందిన మహిళా కానిస్టేబుల్‌ దీపిక, జిల్లా ఆర్ముడ్‌ పోలీస్‌ కానిస్టేబుళ్లు అనూష, శిరీష జాతీయ స్థాయిలో జరగనున్న కబడ్డీ పోలీస్‌ క్రీడాపోటీలకు ఎంపికయ్యారు. వాలీబాల్‌ పోటీలకు జిల్లా ఆర్ముడ్‌ విభాగం మహిళా కానిస్టేబుల్‌ లావణ్య ఎంపికయ్యారు. ఖోఖో క్రీడాపోటీలకు జిల్లా ఆర్ముడ్‌ పోలీస్‌ విభాగానికి చెందిన మహిళా కానిస్టేబుళ్లు దివ్యభారతి, అనూష ఎంపికయ్యారు.

ఫ రాష్ట్రస్థాయి పోటీల్లో ప్రతిభ

కనబర్చిన జిల్లా పోలీసులు

ఫ కబడ్డీ, ఖోఖో, వాలీవాల్‌, బాడ్మింటన్‌ విభాగాల్లో బహుమతులు

ఫ జాతీయ స్థాయికి పలువురు

మహిళా కానిస్టేబుళ్ల ఎంపిక

ఫ అథ్లెటిక్స్‌, జావెలిన్‌ త్రోల్లో మరో

ఇద్దరు పురుష కానిస్టేబుళ్లకు మెడల్స్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement