జాతీయ స్థాయి కబడ్డీ పోటీలకు ఎంపికయ్యా
హైదరాబాద్‌లో జరిగిన పోలీస్ క్రీడల్లో యాదాద్రి జోన్ తరఫున కబడ్డీ, వాలీబాల్ ఆడాను. కబడ్డీ పోటీలో ప్రథమ బహుమతి వచ్చింది. కబడ్డీలో జాతీయ స్థాయి క్రీడలకు ఎంపికయ్యాను. చాలా ఆనందంగా ఉంది. జిల్లాకు మంచిపేరు తీసుకొస్తా.
– దీపిక, కానిస్టేబుల్, సూర్యాపేట జిల్లా
ఇటీవల రాష్ట్ర స్థాయి కబడ్డీ, వాలీబాల్, ఖోఖో పోలీస్ క్రీడాపోటీల్లో ఆడాను. కబడ్డీ, ఖోఖోలో జాతీయ స్థాయికి ఎంపికయ్యాను. జమ్మూకశ్మీర్‌లో జరగనున్న జాతీయ స్థాయి కబడ్డీ, ఖోఖో పోటీల్లో పాల్గొని విజయంతో తిరిగి వస్తాం.
– అనూష, ఏఆర్ కానిస్టేబుల్,
సూర్యాపేట జిల్లా
జాతీయ స్థాయి కబడ్డీ పోటీలకు ఎంపికయ్యా


