రైతులకు మేలు జరిగేలా పనులు
భానుపురి (సూర్యాపేట) : జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద రైతులకు మేలు జరిగే పనులు చేపట్టామని కలెక్టర్ తేజస్ నంద్‌లాల్ పవార్ తెలిపారు. గురువారం సూర్యాపేట కలెక్టరేట్‌లో కేంద్ర గ్రామీణాభివృద్ధి సంస్థ బృందం సభ్యులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా జిల్లాలో జరిగిన ఉపాధి హామీ పనులపై కేంద్ర బృందానికి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. ఉపాధిహామీ పథకం పేరును కేంద్ర ప్రభుత్వం వీబీ జీ రాంజీగా మారుస్తున్న తరుణంలో కేంద్ర గ్రామీణాభివృద్ధి సంస్థ బృందం సభ్యులు సంజయ్ కుమార్ నేతృత్వంలో ఈనెల 28 వరకు జిల్లాలో పర్యటించనున్నారు. అనంతరం ఈజీఎస్ పథకాల పనులపై జిల్లా గ్రామీణ అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఫొటో ఎగ్జిబిషన్‌ను కేంద్ర బృందం, కలెక్టర్ తిలకించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ కె.సీతారామారావు, డిప్యూటీ సీఈఓ శిరీష, కేంద్ర బృందం సభ్యులు పాల్గొన్నారు.
ఫ కలెక్టర్ తేజస్ నంద్‌లాల్ పవార్


