సెప్టెంబర్‌లోగా లిప్టు పనులు ముగించాలి
మేళ్లచెరువు : సెప్టెంబర్ నాటికి మహాత్మాగాంధీ ముక్త్యాల బ్రాంచ్ కెనాల్ లిఫ్టు ఇరిగేషన్ పనులను పూర్తిచేసి అందుబాటులోకి తీసుకురావాలని మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డి అధికారులను, కాంట్రాక్టర్ ను ఆదేశించారు. గురువారం ఆయన చింతలపాలెం మండలం పాతవెల్లటూరు పరిధిలో నిర్మిస్తున్న లిఫ్టు పనులను పరిశీలించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమీక్ష సమావేశంలో మాట్లాడారు. రూ.1,670 కోట్లతో నిర్మింస్తున్న లిప్టు ద్వారా హుజూర్‌నగర్ నియోజకవర్గం పరిధిలోని మఠంపల్లి, మేళ్లచెరువు, చింతలపాలెం మండలాల్లో 53వేల ఎకరాలకు సాగు నీరు అందనుందన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్‌ఈ నాగభూషణం, ఆర్‌డీఓ శ్రీనివాసులు, తహసీల్దార్ సూరయ్య, డీఎస్పీ శ్రీనివాస్‌రెడ్డి, సీఐ రామకృష్ణారెడ్డి, కాంగ్రెస్ మండల వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీనివాసరెడ్డి, అంతయ్య, సైదులు నాయక్, మంజీనాయక్, సంస్థ ప్రతినిఽధి హరీష్ పాల్గొన్నారు.


