కోదాడ: కోదాడ పబ్లిక్ క్లబ్ నూతన కార్యవర్గాన్ని ఆదివారం ఎన్నుకోనున్నారు. ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి జరిగే ఈ ఎన్నికలకు ఎంతో ప్రాధాన్యత ఉంటుంది. పట్టణంలోని వివిధ వర్గాలకు చెందిన 200 మంది ప్రముఖులు ఇందులో సభ్యులుగా ఉన్నారు. ప్రతిసారి ఈ ఎన్నికలు ఏకగ్రీవంగా జరుగుతుండగా ఈ సారి పలువురు పోటీ పడుతుండడంతో ఎన్నిక అనివార్యంగా మారే సూచనలు కనిపిస్తున్నాయి. కోదాడ పబ్లిక్ క్లబ్‌కు చెందిన కొత్త భవనం అమ్మడంతో రూ.మూడున్నర కోట్ల నిధులు క్లబ్ ఖాతాలో ఉండడంతో పోటీ తీవ్రంగా ఉందని పలువురు క్లబ్ సభ్యులు పేర్కొంటున్నారు. అధ్యక్ష, కార్యదర్శి పదవులకు ప్రస్తుత అధ్యక్షుడు పట్టాభిరెడ్డితో పాటు ముడియాల భరత్‌రెడ్డి, రావెళ్ల సీతారామయ్య, మేకల వెంకట్రావ్, పారా సీతయ్య, పయిడిమర్రిత్య బాబు, తీగల కరుణాకర్ పోటీపడుతున్నట్లు సమాచారం. కాగా.. అధ్యక్ష, కార్యదర్శుల ఎన్నికలో కోదాడ ఎమ్మెల్యేతో పాటు మాజీ ఎమ్మెల్యేల నిర్ణయం కీలకం కానున్నట్లు తెలుస్తోంది.
శాసీ్త్రయ పద్ధతులు
అవలంబించాలి
కోదాడరూరల్ : భూసారాన్ని కాపాడుకునేందుకు శాసీ్త్రయ పద్ధతులు అవలంబించాలని ఆత్మ డిప్యూటీ ప్రాజెక్ట్ డైరెక్టర్ నివేదిత రైతులకు సూచించారు. గురువారం కోదాడ మండల పరిధిలోని అల్వాలపురంలో ఆత్మ (వ్యవసాయ సాంకేతిక యాజమాన్య సంస్థ) పథకం కింద ఏర్పాటు చేసిన ఆర్‌పీఎల్ శిక్షాణ కార్యక్రమంలో ఆమె మాట్లాడారు. రైతులు సాగులో రసాయన ఎరువులు ఎక్కువగా వాడటం వల్ల భూమి సారాన్ని కోల్పోయి భవిష్యత్ తరాలకు ఉపయోగం లేకుండా పోతుందన్నారు. రైతులు వ్యవసాయ అధికారుల సూచనల మేరకే ఎరువులను వాడాలన్నారు. పంటల సాగుకు ముందు పచ్చిరొట్చె సాగు చేసుకొని దుక్కిలో కలిపి దున్నుకోవాలన్నారు. పశువుల ఎరువుల తప్పకుండా భూమిలో తోలుకోవాలన్నారు. నానో యూరియా, డీఏపీని పంటలకు స్ప్రే చేసుకోవాలని రైతులకు సూచించారు. వరికి ప్రత్యామ్నాయంగా రైతులు ఆయిల్‌పామ్ సాగు చేసుకోవాలని తెలిపారు. కార్యక్రమంలో గడ్డిపల్లి కేవీకే శాస్త్రవేత్త, ఏడీఏ ప్రశాంతి, ఏఓ రజిని, ఆత్మ చైర్మన్ లింగయ్య, దేవప్రసాద్, ఏఈఓలు నగేష్, ఝూన్సీ, వినోద్, అన్వేష్, సల్మా ఉన్నారు.


