ప్రజల మన్ననలు పొందేలా పనిచేయాలి | - | Sakshi
Sakshi News home page

ప్రజల మన్ననలు పొందేలా పనిచేయాలి

Mar 13 2026 7:32 AM | Updated on Mar 13 2026 7:32 AM

హౌసింగ్‌ కాలనీని సిద్ధం చేయాలి

భానుపురి (సూర్యాపేట) : ప్రజాప్రతినిధులు ప్రజల మన్ననలు పొందేలా పనిచేయాలని రాష్ట్ర ఇరిగేషన్‌, సివిల్‌ సప్లయ్‌ శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు. గురువారం ప్రజాపాలన – ప్రగతి ప్రణాళికలో భాగంగా సూర్యాపేటలోని ఓ ఫంక్షన్‌ హాల్‌లో సర్పంచులు, మున్సిపల్‌ చైర్‌పర్సన్లు, వార్డు కౌన్సిలర్లు, ఇతర ప్రజా ప్రతినిధులకు నిర్వహించిన శిక్షణ కార్యక్రమాన్ని కలెక్టర్‌ తేజస్‌నంద్‌ లాల్‌ పవార్‌, ఎస్పీ నరసింహతో కలిసి ప్రారంభించారు. వేసవిలో తాగునీటి సమస్య రాకుండా అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పని చేయాలన్నారు. దేవాదుల ప్రాజెక్టు నుంచి గోదావరి జలాలను తుంగతుర్తి నియోజకవర్గానికి తీసుకురావడానికి పనులు జరుగుతున్నాయని తెలిపారు. మార్చి 6 నుంచి ప్రారంభించిన ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమాన్ని జూన్‌ 12 వరకు 99 రోజుల పాటు రాష్ట్రవ్యాప్తంగా అమలు చేయనున్నట్లు తెలిపారు. రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు చేస్తున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలపై అవగాహన కల్పించడంతో పాటు అర్హులైన లబ్ధిదారులకు అవి చేరేలా చూడాలని తెలిపారు. రాష్ట్రంలో ఈ ఖరీఫ్‌ సీజన్లో 148 లక్షల మెట్రిక్‌ టన్నుల వరి ధాన్యం పండిందని, రైతుల నుంచి 72 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసి రూ.20వేల కోట్లు చెల్లించామన్నారు. కార్యక్రమంలో తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేలు, కోదాడ ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి, తెలంగాణ టూరిజం డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌ పటేల్‌ రమేష్‌ రెడ్డి, అదనపు కలెక్టర్‌ సీతారామారావు, జెడ్పీ సీఈఓ శిరీష, డీపీఓ యాదగిరి, సీపీఓ కిషన్‌, డీవైఎస్‌ఓ వెంకటరెడ్డి, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్‌ వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు.

హుజూర్‌నగర్‌ : హుజూర్‌నగర్‌లోని మోడల్‌ హౌసింగ్‌ కాలనీని అన్ని హంగులతో ప్రారంభోత్సవానికి సిద్ధం చేయాలని మంత్రి ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి అధికారులను ఆదేశించారు. గురువారం మున్సిపాలిటీ పరిధిలోని రామస్వామి గుట్ట వద్ద 110 ఎకరాలలో నిర్మిస్తున్న 2,160 ఇందిరమ్మ ఇళ్ల మోడల్‌ హౌసింగ్‌ కాలనీని కలెక్టర్‌ తేజస్‌ నందలాల్‌ పవార్‌, ఎస్పీ నరసింహతో కలిసి పరిశీలించారు. ఈ సందర్బంగా హిళ్ల బ్లాక్‌లు, అంతర్గత రోడ్లు, సభాస్థలి, మొక్కలు, పార్కింగ్‌ స్థలాన్ని పరిశీలించారు. మంత్రి వెంట హౌసింగ్‌ పీడీ సిద్ధార్థ, హార్టికల్చర్‌ పీడీ నాగయ్య, ఆర్డీఓ శ్రీనివాసులు, మిషన్‌ భగీరథ ఈఈ కరుణాకర్‌ రెడ్డి, విద్యుత్‌ డీఈ వెంకట కిష్టయ్య, మున్సిపల్‌ కమిషనర్‌ శ్రీనివాస్‌, తహసీల్దార్‌ కవిత, మున్సిపల్‌ చైర్మన్‌ దొంతగాని శ్రీనివాస్‌, వైస్‌ చైర్మన్‌ తన్నీరు మల్లిఖార్జున్‌ రావు తదితరులున్నారు.

ఫ మంత్రి ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement