కష్టసుఖాల్లో దైవమార్గాన్ని వీడొద్దు | - | Sakshi
Sakshi News home page

కష్టసుఖాల్లో దైవమార్గాన్ని వీడొద్దు

Mar 13 2026 7:32 AM | Updated on Mar 13 2026 7:32 AM

మేళ్లచెరువు: మండల కేంద్రంలోని భూదేవి సమేత వేంకటేశ్వరస్వామి ఆలయంలో గురువారం స్వామివారి కల్యాణాన్ని వైభవంగా నిర్వహించారు. దేవాలయం నుంచి కల్యాణ మండపం వరకు స్వామి వారి ఉత్సవ విగ్రహాలను ఊరేగింపుగా తీసుకువచ్చారు. స్వామి, అమ్మవారిని పట్టువస్త్రాలతో అలంకరించి ముస్తాబు చేశారు. అనంతరం గణపతిపూజ, పుణ్యాహవాచనం, విశ్వక్సేన పూజలు చేసి మాంగల్యధారణ నిర్వహించారు. అనంతరం శ్రీత్రిదండి చినజీయర్‌స్వామి భక్తులనుద్దేశించి ప్రవచించారు. కష్టసుఖాల్లో దైవమార్గాన్ని వీడొద్దని, ఆహారంలో షడ్రుచుల వల్లే జీవితంలో అన్ని ఎదుర్కొనే విధంగా మనసును స్థిరత్వం చేసుకోవాలన్నారు. దేవుడు గుడిలో, మనసులో రెండు రూపాల్లో కొలువై ఉన్నాడని రెండుచోట్లా దైవాన్ని స్మరించాలని తెలిపారు. అనంతరం తెలుగు సంవత్సరాది క్యాలెండర్‌, పంచాంగం ఆవిష్కరించారు. కార్యక్రమంలో మై హోం సంస్థ చైర్మన్‌ డాక్టర్‌ జూపల్లి రామేశ్వరరావు, శ్రీకుమారి దంపతులు, రామ్మోహన్‌రావు, అరుణ దంపతులు, వినోద్‌రావు, రామురావు, శ్యాంరావు, జగపతిరావు, యూనిట్‌ హెడ్‌ శ్రీనివాసరావు పాల్గొన్నారు.

ఫ శ్రీత్రిదండి చినజీయర్‌స్వామి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement