హోలీ పండుగను సంతోషంగా జరుపుకోవాలి
● ఎస్పీ నరసింహ
సూర్యాపేటటౌన్ : హోలీ వేడుకలను ప్రమాదాలకు దూరంగా ఉంటూ సంతోషకర వాతావరణంలో కలిసిమెలిసి జరుపుకోవాలని ఎస్పీ నరసింహ ఆదివారం ఒక ప్రకటనలో కోరారు. రంగులు చల్లుకునే సమయంలో పరిసరాలను గమనించాలని కోరారు. రంగులు ఇష్టపడని వ్యక్తులపై బలవంతంగా చల్లవద్దన్నారు. బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించవద్దని, మద్యం మత్తులో వాహనాలు నడపకూడదని సూచించారు. రసాయన రంగులు ఉపయోగిస్తే అనారోగ్యం బారినపడే అవకాశం ఉందని, సంప్రదాయ రంగులతో హోలీ జరుపుకోవాలని కోరారు.
విద్యా కమిషన్ సిఫార్సులను ఖండిస్తున్నాం
సూర్యాపేట టౌన్ : ఉపాధ్యాయుల వేతనాలపై విద్యా కమిషన్ సిఫార్సులను ఖండిస్తున్నామని టీపీటీఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి పుప్పాల వీరన్న అన్నారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని బాలాజీ నగర్‌లో టీపీటీఎఫ్ కార్యాలయాన్ని ఆయన ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ ప్రైవేట్ విద్యా వ్యవస్థ రద్దుకు సిఫార్సు లేకపోవడం బాధాకరమన్నారు. కమిషన్ సిఫార్సులపై ఉపాధ్యాయ సంఘాలతో చర్చించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో యూనియన్ ప్రతినిధులు శ్రీనివాస్, యాకయ్య, చంద్రారెడ్డి, రమేష్, రవికుమార్, లాలయ్య, మహేష్, రాములు, మల్లయ్య, శంకర్ తదితరులు పాల్గొన్నారు.
ప్రశాంతంగా ఎస్సీ స్టడీ సర్కిల్ అర్హత పరీక్ష
సూర్యాపేటటౌన్ : జిల్లా కేంద్రంలోని ఎస్సీ స్టడీ సర్కిల్‌లో పోటీ పరీక్షల కోసం ఐదు నెలల ఉచిత రెసిడెన్షియల్ ఫౌండేషన్ కోర్సు శిక్షణకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు ఆదివారం స్థానిక ఎస్వీ డిగ్రీ కళాశాలలో ప్రవేశ పరీక్ష నిర్వహించారు. మొత్తం 267 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా 144 మంది హాజరై పరీక్ష రాశారు. పరీక్ష కేంద్రాన్ని జిల్లా షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి అధికారి కె.దయానందరాణి పరిశీలించారు.
విద్యాధికారిగా అదనపు బాధ్యతలు ఇవ్వాలి
సూర్యాపేట : రాష్ట్రంలోని సీనియర్ ప్రధానోపాధ్యాయులకు ఎంఈఓలుగా అదనపు బాధ్యతలు ఇచ్చి తిరుమలగిరి మండలంలో గెజిటెడ్ ప్రధానోపాధ్యాయుడు దామెర శ్రీనివాస్ ఇవ్వకపోవడం దుర్మార్గమని తెలంగాణ రజక ఉద్యోగ సమాఖ్య సూర్యాపేట జిల్లా అధ్యక్షుడు నిమ్మల శ్రీనివాస్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. వ్యక్తిగత కారణాలను సాకుగా చూపి అదనపు బాధ్యతలు ఇవ్వకపోవడం సరికాదన్నారు. దామెర శ్రీనివాస్‌కు ఎంఈఓగా అదనపు బాధ్యతలు ఇచ్చి న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
హోలీ పండుగను సంతోషంగా జరుపుకోవాలి


