చివ్వెంల(సూర్యాపేట) : ప్రజానాట్యమండలి జిల్లా మహా సభలను ఈ నెల 15న సూర్యాపేట పట్టణంలో నిర్వహించనున్నట్లు సంఘం జిల్లా అధ్యక్షుడు బచ్చలకూరి రాంబాబు తెలిపారు. ఆదివారం మండలంలోని బి.చందుపట్ల గ్రామంలో సభలకు సంబంధించిన కరపత్రాలను ఆయన విష్కరించి మాట్లాడారు. మహాసభలకు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కట్ట నర్సింహారావు, ఉపాధ్యక్షుడు సాంబరాజు యాదగిరి హాజరు కానున్నట్లు పేర్కొన్నారు. కవులు, కళాకారులు పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. కార్యక్రమంలో నాయకులు పిడమర్తి అశోక్, ధరావతు చిరంజీవి, బచ్చలకూరి వెంకటేశ్, ప్రియాంక, నవీన్, కల్యాణ్, ఉప్పమ్మ, అలివేలు, దేవమ్మ, కోలాటం మాస్టర్, శంకర్ నాయక్, శ్వేత, ప్రమీల, సతీష్ పాల్గొన్నారు.
సూర్యక్షేత్రంలో సౌరహోమం
అర్వపల్లి : జాజిరెడ్డిగూడెం మండలం తిమ్మాపురంలోని సూర్యనారాయణస్వామి క్షేత్రంలో ఆదివారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. అర్చకులు స్వామి వారిని ప్రత్యేకంగా అలంకరించి అభిషేకాలు జరిపారు. యజ్ఞశాలలో మహాసౌరహోమం నిర్వహించారు. వివిధ ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. కార్యక్రమంలో క్షేత్ర వ్యవస్థాపకులు కాకులారపు రజితజనార్దన్, గణపురం నరేష్, ఇంద్రారెడ్డి, బాలమురళీకృష్ణ, అర్చకులు భీంపాండే, అంకిత్‌పాండే పాల్గొన్నారు.


