వికసిత్‌ భారత్‌ మనందరి లక్ష్యం | - | Sakshi
Sakshi News home page

వికసిత్‌ భారత్‌ మనందరి లక్ష్యం

Mar 6 2026 8:04 AM | Updated on Mar 6 2026 8:04 AM

సూర్యాపేటటౌన్‌ : వికసిత్‌ భారత్‌ ప్రతిఒక్కరి లక్ష్యమని మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయ జాతీయ సేవ పథకం కోఆర్డినేటర్‌ ఆర్‌.వెంకటనారాయణ రెడ్డి అన్నారు. గురువారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని శ్రీ వెంకటేశ్వర డిగ్రీ కళాశాలలో కేంద్ర ప్రభుత్వ యువజన వ్యవహారాల క్రీడా మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన వికసిత్‌ భారత్‌ కార్యక్రమానికి హాజరై మాట్లాడారు. మహాత్మా గాంధీ యూనివర్సిటీ పరిధిలోని 163 ఎన్‌ఎస్‌ఎస్‌ యూనిట్‌ సెల్స్‌ ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం వికసిత్‌ భారత్‌ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. 102 మంది విద్యార్థులు పాల్గొనగా ఐదుగురు విద్యార్థులను వికసిత్‌ భారత్‌ కార్యక్రమానికి ఎంపిక చేసినట్లు చెప్పారు. కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్‌ కెప్టెన్‌ డాక్టర్‌ వెంకటేశులు, కళాశాల వైస్‌ చైర్మన్‌ కే.రాజేందర్‌ రెడ్డి, జిల్లా ట్రెజరీ అధికారి ఎస్‌.రవికుమార్‌, ట్రైబల్‌ వెల్ఫేర్‌ కళాశాల ప్రిన్సిపాల్‌ శ్రీవాణి, కళాశాల వైస్‌ ప్రిన్సిపాల్‌ ఎల్‌ఎస్‌ఆర్‌ కోఆర్డినేటర్లు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement