మార్చి నాటికి ఇళ్ల నిర్మాణం పూర్తి | - | Sakshi
Sakshi News home page

మార్చి నాటికి ఇళ్ల నిర్మాణం పూర్తి

Feb 27 2026 4:07 AM | Updated on Feb 27 2026 4:07 AM

మార్చి నాటికి ఇళ్ల నిర్మాణం పూర్తి

మార్చి నాటికి ఇళ్ల నిర్మాణం పూర్తి

హుజూర్‌నగర్‌ : హుజూర్‌నగర్‌లోని ఫణిగిరిగుట్ట వద్ద చేపట్టిన కాలనీ ఇళ్ల నిర్మాణ పనులను మార్చి మొదటి వారం నాటికి పూర్తి చేస్తున్నట్లు రాష్ట్ర పౌరసరఫరాల, నీటిపారుదల శాఖ మంత్రి నలమాద ఉత్తమ్‌కుమార్‌రెడ్డి తెలిపారు. గురువారం హుజూర్‌నగర్‌ పట్టణ శివారులో ఇళ్ల నిర్మాణ పనులను జిల్లా కలెక్టర్‌ తేజస్‌ నంద్‌లాల్‌ పవార్‌తో కలిసి పరిశీలించారు. ప్రతి బ్లాకు తిరిగి పనుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ నిరుపేదలు, వ్యవసాయ కూలీలు, రైస్‌ మిల్లు కార్మికులకు ఆశ్రయం కల్పించాలన్న లక్ష్యంతో 110 ఎకరాల దేవాలయ భూములను కొనుగోలు చేసి రూ.125 కోట్లతో 2,160 ఇళ్ల నిర్మిస్తున్నామని తెలిపారు. తొలి విడత పట్టణంలోని నిరుపేదలకు సీఎం రేవంత్‌రెడ్డి చేతుల మీదుగా పంపిణీ చేస్తామన్నారు. రెండవ విడతలో నియోజకవర్గంలోని పేదలకు అందిస్తామన్నారు. కార్యక్రమంలో ఎస్పీ కె.నరసింహ, మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ దొంతగాని శ్రీని వాస్‌, వైస్‌ చైర్మన్‌ తన్నీరు మల్లికార్జున్‌, ఏఎంసీ చైర్మన్‌ రాధికఅరుణ్‌కుమార్‌, హౌసింగ్‌ పీడీ సిద్ధార్థ, ఆర్టికల్చర్‌ పీడీ నాగయ్య తదితరులు పాల్గొన్నారు.

ఫ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి

ఫ హుజూర్‌నగర్‌,

మేళ్లచెరువులో మంత్రి పర్యటన

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement