నేర రహిత సమాజాన్ని నిర్మిద్దాం | - | Sakshi
Sakshi News home page

నేర రహిత సమాజాన్ని నిర్మిద్దాం

Mar 12 2026 7:10 AM | Updated on Mar 12 2026 7:10 AM

మునగాల : నేరరహిత సమాజ నిర్మాణానికి ప్రతిఒక్కరూ కృషిచేయాలని ఎస్పీ నరసింహ పిలుపునిచ్చారు. ప్రజాపాలన–ప్రగతి ప్రణాళికలో భాగంగా బుధవారం జిల్లా పోలీస్‌ శాఖ ఆధ్వర్యంలో మునగాల మండలం ఆకుపాములలో నిర్వహించిన అవగాహన సదస్సుకు ఎస్పీ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. బినాన్స్‌, క్రిఫ్టో కరెన్సీ లాంటి డిజిటల్‌ మనీ మార్పిడిలో జాగ్రత్తగా ఉండాలన్నారు. అత్యాశతో సైబర్‌ మోసగాళ్ల వలలో చిక్కి ఆర్థికంగా నష్టపోవద్దన్నారు. ప్రస్తుత సమాజాన్ని డ్రగ్స్‌ అనే చీడపీడ పట్టి పీడిస్తుందని.. డ్రగ్స్‌ను నిర్మూలించకపోతే సమాజంలో నేరప్రవత్తి పెరిగిపోతునుందన్నారు. యువత డ్రగ్స్‌, గంజాయి మత్తుకు బానిసలై జీవితాన్ని అంధకారం చేసుకోవద్దన్నారు. వాహనదారులు రోడ్డు నియమ నిబంధనలు పాటించాలని సూచించారు. కార్యక్రమంలో కోదాడ డీఎస్పీ రణబోతు శ్రీనివాస్‌రెడ్డి, గ్రామ సర్పంచ్‌ విలాసకవి ఇందిర, సైబర్‌ సెక్యూరిటీ సెల్‌ ఇన్‌స్పెక్టర్‌ లక్ష్మీనారాయణ, మునగాల, కోదాడ టౌన్‌, సూర్యాపేట టౌన్‌ సీఐలు డి.రామకృష్ణారెడ్డి, శివశంకర్‌, వెంకటయ్య, మునగాల ఎస్‌ఐ ప్రవీణ్‌కుమార్‌, రవీందర్‌, ఏడుకొండలు, కోదాడ ట్రాన్స్‌పోర్ట్‌ ఇన్‌స్పెక్టర్‌ రామాచారి, పోలీస్‌ సిబ్బంది, గ్రామపెద్దలు, యువకులు పాల్గొన్నారు.

మహిళల భద్రతకు ప్రాధాన్యం

నడిగూడెం : మహిళల భద్రతకు ప్రాధాన్యతనిస్తున్నట్లు జిల్లా ఎస్పీ నరసింహ తెలిపారు. బుధవారం నడిగూడెం మండలం వల్లాపురంలో పోలీస్‌ శాఖ ఆద్వర్యంలో ప్రజా పాలన–ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా సైబర్‌ నేరాలపై నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. తప్పుడు మార్గంలో నడిచే పిల్లలను తల్లిదండ్రులు హెచ్చరించాలన్నారు. అనంతరం వల్లాపురం గ్రామ సర్పంచ్‌ కేశగాని సరిత ఎస్పీని సన్మానించారు. ఈ కార్యక్రమంలో పోలీస్‌ అధికారులతోపాటు ఎస్‌ఐ గందమళ్ల అజయ్‌ కుమార్‌, వల్లాపురం సర్పంచ్‌ కేశగాని సరిత పాల్గొన్నారు.

ఫ ఎస్పీ నరసింహ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement