రెండు దశల్లో జనగణన | - | Sakshi
Sakshi News home page

రెండు దశల్లో జనగణన

Mar 12 2026 7:10 AM | Updated on Mar 12 2026 7:10 AM

2011 జనాభా లెక్కల వివరాలు

భానుపురి (సూర్యాపేట) : జిల్లాలో జనగణన ప్రక్రియ ప్రారంభమైంది. 2011లో చివరిసారి జిల్లాలో జనగణన జరిగింది. మళ్లీ 2027లో జరగనున్న జనాభా లెక్కల కోసం ఇప్పటి నుంచే జిల్లా యంత్రాంగం కసరత్తు మొదలుపెట్టింది. మొదటగా జిల్లాలోని ఇళ్లను లెక్కించి.. అనంతరం సిబ్బంది నియామకం పూర్తి చేసి జనాభా లెక్కలను తీయనున్నారు. ఈ సారి జనగణనను డిజిటల్‌ విధానంలోనే చేపట్టాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. ఇందుకోసం ప్రజల నుంచి సేకరించాల్సిన సమాచారంతో పాటు వివరాల నమోదు, తదితర విషయాలపై స్పష్టత కోసం జిల్లా నుంచి మండల స్థాయి అధికారుల వరకు శిక్షణ కార్యక్రమాలను జిల్లా యంత్రాంగం బుధవారం ప్రారంభించింది. ఈ శిక్షణ మూడు రోజుల పాటు జరగనుంది.

మొదటి దశలో ఇళ్లు..

ప్రభుత్వ సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు, మౌలిక సదుపాయాల ప్రణాళికలు రూపొందించడానికి జనాభా గణన ఎంతగానో దోహదపడుతోంది. ప్రతి పదేళ్లకోసారి కేంద్ర ప్రభుత్వం ఈ జనగణన నిర్వహిస్తుండగా.. చివరిసారిగా 2011లో చేపట్టింది. అయితే 2021లో జనాభా లెక్కలు తీయాల్సి ఉన్నా.. కరోనా కారణంగా సాధ్యపడలేదు. ఈ క్రమంలో 2027లో దేశవ్యాప్తంగా జనాభా లెక్కలు చేయనున్నారు. జిల్లాలో ఈ గణన రెండు దశల్లో జరగనుంది. మొదటగా ఈ ఏడాది మే 11వ తేదీ నుంచి జూన్‌ 9వ తేదీ వరకు ఇళ్ల లెక్కింపు చేపట్టనున్నారు. రెండో దశలో జనాభా గణన 2027 ఫిబ్రవరిలో జరగనుంది.

ప్రత్యేక పోర్టల్‌ ద్వారా..

ఈసారి జరగనున్న జనాభా గణనను దేశంలో తొలిసారిగా డిజిటల్‌ విధానంలో నిర్వహించనున్నారు. మొబైల్‌ యాప్‌లు, వెబ్‌ పోర్టర్లను ఉపయోగించి గణన ప్రక్రియ ఉండనుంది. అలాగే ప్రజలు తమ వివరాలను తామే స్వయంగా ఆన్‌లైన్‌లో నమోదు చేసుకునే అవకాశాన్ని కల్పించనున్నారు. ఈ ప్రత్యేక పోర్టల్‌ను గణన ప్రారంభానికి సుమారు 15 రోజుల ముందు ప్రజలకు అందుబాటులో ఉంచనున్నారు. కాగా ప్రతి మండలంలోని రెవెన్యూ గ్రామాలు, పట్టణాల్లోని వార్డులను గణన బ్లాకులుగా ఎలా విభజించాలి..? గణన ప్రక్రియను ఎలా నిర్వహించాలన్న.. ? అనే అంశాలపై అధికారులకు శిక్షణతో అవగాహన కల్పిస్తున్నారు. ఈ శిక్షణ అనంతరం అధికారులు బ్లాక్‌లను గుర్తించి ఎంపిక చేసిన ఎన్యూమరేటర్ల ద్వారా ఇళ్ల లెక్కింపు చేపట్టనున్నారు.

మొత్తం జనాభా 10,99,560

పురుషులు 5,49,560

మహిళలు 5,50,000

ఇళ్ల సంఖ్య 3 లక్షలకుపైగా..

ఫ మే 11 నుంచి ఇళ్ల లెక్కింపు

ఫ 2027 ఫిబ్రవరిలో జనగణన షురూ

ఫ ఈసారి డిజిటల్‌ విధానంలో

వివరాల సేకరణ

ఫ సిబ్బందికి శిక్షణ ప్రారంభం

ఫ నేరుగా వివరాల నమోదుకు

ప్రజలకూ అవకాశం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement