నేడు మంత్రి ఉత్తమ్‌ రాక | - | Sakshi
Sakshi News home page

నేడు మంత్రి ఉత్తమ్‌ రాక

Mar 12 2026 7:10 AM | Updated on Mar 12 2026 7:10 AM

హుజూర్‌నగర్‌ : రాష్ట్ర సాగునీటిపారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి ఎన్‌.ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి గురువారం హుజూర్‌నగర్‌ రానున్నారు. మంత్రి సాయంత్రం 6 గంటలకు పట్టణానికి చేరుకుని స్థానిక రామస్వామి గుట్ట వద్ద హౌసింగ్‌ కాలనీ ఇళ్ల నిర్మాణ పనులను పరిశీలించి పనుల పురోగతిపై ఉన్నతాధికారులతో సమీక్షిస్తారు. అనంతరం సాయంత్ర 6.30 గంటలకు మంత్రి ఉత్తమ్‌ కోదాడ వెళతారు.

‘దక్కన్‌ సిమెంట్స్‌’లో

కొనసాగుతున్న విచారణ

పాలకవీడు : మండల పరిధిలోని దక్కన్‌ సిమెంట్స్‌ కర్మాగార యాజమాన్యం అటవీ భూమిని ఆక్రమించినట్టు ఓ వ్యక్తి సుప్రీంకోర్టును ఆశ్రయించాడు. దీనిపై విచారణ జరపాల్సిందిగా సుప్రీం కోర్టు కేంద్ర సాధికార కమిటీని ఆదేశించింది. కమిటీ ఆదేశాలతో సర్కిల్‌, జిల్లా అటవీ అధికారులు మూడు రోజులుగా విచారణ చేపడుతున్నారు. విచారణలో భాగంగా హైదరా బాద్‌ సర్కిల్‌ అటవీ ముఖ్య సంరక్షణ అధికారి (సీసీఎఫ్‌) శర్వానంద్‌ బుధవారం జిల్లా అటవీశాఖ అధికారి (డీఎఫ్‌ఓ) సతీష్‌కుమార్‌తో కలిసి దక్కన్‌ సిమెంట్స్‌ కర్మాగారం, సైదులునామా రిజర్వ్‌ ఫారెస్ట్‌ భూములను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. పరిశ్రమకు కేటాయించిన భూములు, అటవీ భూముల హద్దులు గుర్తించారు. త్వరలో నివేదికను తయారు చేసి ఉన్నతాధికారులకు నివేదిక అందజేస్తామని అధి కారులు వెల్లడించారు. ఈ విచారణలో ఫారెస్ట్‌ రేంజ్‌ ఆదిత్య, పాలకవీడు సెక్షన్‌ అధికారి నవీన్‌, బీట్‌, సిబ్బంది పాల్గొన్నారు.

ఉద్యాన పంటల

సాగుతో అధిక ఆదాయం

చిలుకూరు : ఉద్యాన పంటల సాగుతో స్వల్వ కాలంలో తక్కువ పెట్టుబడితో అధిక ఆదా యం వస్తుందని జిల్లా ఉద్యాన వన అధికారి తీగల నాగయ్య అన్నారు. బుధవారం చిలు కూరు మండలం చెన్నారిగూడెంలో తీగ పందిరి ద్వారా కూరగాయలు సాగు చేస్తున్న రైతుల వ్యవసాయ క్షేత్రాలను పరిశీలించి మాట్లాడారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఉద్యాన సాగుకు అందించే సబ్సిడీలను ఉపయోగించుకోవాలన్నా రు. కార్యక్రమంలో ప్రాంతీయ ఉద్యాన అధికారి అనిత, విస్తరణాధికారి రంగు ముత్యం రాజు, శ్రీనివాస్‌, బ్రహ్మం పాల్గొన్నారు.

నోడల్‌ బృందం తనిఖీ

గరిడేపల్లి : మండల కేంద్రలోని ప్రాథమిక పాఠశాలను బుధవారం జిల్లా నోడల్‌ బృందం సభ్యులు తనిఖీ చేశారు. పాఠశాలలోని రికార్డులు, మధ్యాహ్న భోజనం, గ్రంథాలయం, ఫార్మేటివ్‌, సమ్మెటివ్‌ పరీక్షా ఫలితాలు, సీసీఈ రిపోర్టులను పరిశీలించి సంతృప్తిని వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో నోడల్‌ టీమ్‌ అధికారి కె.గోపిరెడ్డి, నోడల్‌ సభ్యులు చారుగుండ్ల రాజశేఖర్‌, రఘునాయక్‌, మండల విద్యాధికారి చత్రునాయక్‌, ప్రధానోపాధ్యాయులు హైమావతి, ఉపాధ్యాయులు కిషోర్‌బాబు, దీప్తి తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement